పాలనే కాదు.. కాలమూ మారింది..

By Ritwika Ram Jul. 22, 2021, 07:56 pm IST
పాలనే కాదు.. కాలమూ మారింది..

మనం మంచి చేయాలని అనుకుంటే.. ప్రకృతి కూడా మనకు సాయపడుతుంది. ఇది ఎప్పటినుంచో రుజువు అవుతున్న విషయం. ఇప్పుడు సజీవ సాక్ష్యంగా కనిపిస్తోంది. వానలు లేక అల్లాడిన కరువు సీమ.. అదే రాయలసీమ.. ఇప్పుడు కోనసీమలా కనువిందు చేస్తోంది. నాడు కురువు విలయతాండవం చేసిన చోటే.. ఇప్పుడు వాన నృత్యం చేస్తోంది. గతంలో వానలు లేక కన్నీటి పంట పండించిన రైతులు.. ఇప్పుడు క్షణం తీరిక లేకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదంతా రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కలుగుతున్న మార్పు. పరిపాలనే కాదు.. కాలమూ మారింది.

అప్పుడు.. కాటేసిన కరువు

రెండున్నరేళ్ల కిందటి దాకా వానలు లేవు. కరువు కాటేసింది. అప్పుడే కాదు.. 1995 నుంచి 2004 దాకా ఇలానే ఉండేది రాష్ట్రం. రాయలసీమలో మరీ ఘోరం.. నాలుగు చినుకులు పడినా మండిపోతున్న బండరాయి మీద ఆవిరి అయినట్లు ఆవిరి ఆయిపోయేవి. రైతుల ఆత్మహత్యలు కోకొల్లలు. ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ‘వ్యవసాయమే దండగ’ అని చెప్పి రైతుల విషయంలో తన ఉద్దేశాన్ని, వైఖరిని స్పష్టం చేశారు. కరువుతో అల్లాడుతున్న రైతులను తన పదవీకాలంలో ఆదుకున్నదీ లేదు.

2014లో బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మారలేదు. రెయిన్ గన్స్‌తో అనంతపురం కరువు తరిమేశామంటూ కామెడీ చేశారు. ఏళ్లుగా నీళ్లు పారని నేలలు.. నాలుగు చుక్కలు చిలకరిస్తేనే తడిసిపోతాయా? కరువు పారదోలేందుకు తీసుకున్న చర్యలు శూన్యం. పోనీ రావాల్సిన నీటి వాటాల విషయంలో పక్క రాష్ట్రంతో మాట్లాడేంత ధైర్యం కూడా ఆయనకు లేకపోయింది. ఎందుకంటే.. ఓటుకు కోట్లు ఇస్తూ తన గ్యాంగ్‌తో అడ్డంగా దొరికి పోయారు కదా.

పోలవరం సహా ప్రాజెక్టులన్నింటినీ నిర్లక్ష్యం చేశారు. అటు కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులన్నీ బోసిపోయి కనిపించేవి. చంద్రబాబు హయాంలో కొన్ని ప్రాజెక్టుల గేట్లు ఒక్కసారి కూడా ఎత్తలేదంటేనే అర్థం చేసుకోచ్చు పరిస్థితి ఎలా ఉండేదో. కాసింత వర్షం పడినా పైనున్న ప్రాజెక్టుల దగ్గరే ఆగిపోయేవి. మన దాకా వచ్చేది శూన్యం. వాన జాడే లేక రాయలసీమ అల్లాడింది. అనంతపురం, కడప సహా చాలా ప్రాంతాల్లో బోర్లతో 1000 అడుగుల దాకా తవ్వి చూసినా నీళ్లు రాని పరిస్థితి. మెట్ట ప్రాంతాలైన ప్రకాశం, నెల్లూరు కూడా తాగునీటికి ఇక్కట్లు పడ్డాయి.

Also : కృష్ణా జలాల వివాదం: తెలంగాణ తీరును లోక్‌సభలో ఎండగట్టిన ఎంపీ అవినాష్‌ రెడ్డి

ఇక పాడి పరిస్థితి మరీ ఘోరం. వానలు పడక ఎక్కడా పచ్చని గడ్డి పరక కూడా కనిపించేది కాదు.. పశువులకు మేత దొరక్క ఎంతో మంది అమ్మేసుకున్నారు. సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని చాలా గ్రామాల్లోని ప్రజలు బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస పోయారు. కరువుతో పోరాడలేక కనీసం కూలి పనులైనా చేసుకోవచ్చని వెళ్లిపోయారు.

ఇప్పుడు.. ఆగని వాన..

కరువుతో అల్లాడిన రాష్ట్రం వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతోనే ఆకుపచ్చని దుప్పటి పరిచినట్లుగా మారిపోయింది. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారానికి చినుకులతో స్వాగతం పలికింది వానమ్మ. అప్పటి నుంచి నేలను తడుపుతూనే ఉంది. 2019లో దంచికొట్టింది. అక్కడే ఆగలేదు.. 2020, ఇప్పుడు 2021లోనూ కుమ్మరిస్తోంది. రుతుపవనాలు వచ్చిన నెలన్నరలోనే చిన్నా, పెద్దా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. చెక్ డ్యాములు నీటితో నిండికనిపిస్తున్నాయి. కాలువలు తడి ఆరకుండా పారుతూనే ఉన్నాయి. వరి పంటకు నీళ్ల బాధ లేదు.. పశువులకు మేత బాధ లేదు.. రైతులకు కరువు భయం లేదు. భూగర్భ జలమూ బాగా పెరిగింది. వలసలు ఆగిపోయాయి. రైతులకు పెట్టుబడి సాయమూ అందుతోంది.

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఇలానే జరిగింది. 2004 ముందు దాకా కురవడమే మరిచిపోయిన వాన.. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక కురవడమే పనిగా పెట్టుకుంది. హరితాంధ్రప్రదేశ్, జలయజ్ఞం లాంటివి ఇందుకు దోహాదం చేశాయి. ఇప్పుడూ అంతే.. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా వాన కురుస్తూనే ఉంది. రాయలసీమ కోనసీమలా మారిందంటూ.. టీడీపీ అనుకూల పత్రిక ‘ఈనాడు’ రాస్తోంది. పాలనతోపాటే కాలమూ మారిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. మరోవైపు ప్రాజెక్టుల విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు వైఎస్ జగన్. కృష్ణా నీటిలో రావాల్సిన వాటా కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్నారు. మరోవైపు ఆంధ్రుల దశాబ్దాల కల పోలవరమూ సిద్ధమైంది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రాజెక్టుల ద్వారా రాయలసీమను సస్యాశ్యామలం చేసే పనులు కొనసాగుతున్నాయి. రాళ్ల సీమ.. నీళ్లతో నిండి తన రూపు మార్చకుంది. రాష్ట్రంపై ఆకుపచ్చని దుప్పటి పరుచుకుంది.

Also Read : ఆక్వారంగం చిరకాల వాంఛను నెరవేరుస్తున్న జగన్ ప్రభుత్వం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp