తప్పులు చేయడం క్షమాపణలు కోరడం చంద్రబాబుకు ఆనవాయితినే..

By Krishna Babu Jan. 14, 2021, 01:58 pm IST
తప్పులు చేయడం క్షమాపణలు కోరడం చంద్రబాబుకు ఆనవాయితినే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడి రాజకీయమే వేరు. ప్రజలకోసం కాకుండా పదవి కోసేమే ఆయన ఎక్కువ ఆరాటపడుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను చిన్న చూపు చూస్తూ, అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచి ప్రజలే తనకు దేవుళ్ళుగా మారిపోవడం ఆయనకు పరిపాటి అని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పే మాట. ఈ మాటలను నిజం చేస్తూ మరోసారి క్షమాపణలు చెబుతూ ప్రజలను ఏమార్చే పని పెట్టుకున్నారు చంద్రబాబు.

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు అక్కడకి వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఏమి తప్పు చేశానో తనకి తెలియడంలేదంటు తనని కాదని జగన్ కు పూనకం వచ్చినట్టు ఓట్లు వేశారని. తనకి తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే తనని క్షమించాలని ప్రజని కోరారు. రాష్ట్ర ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఇలాంటి వాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది.

నిజానికి చంద్రబాబుకు అధికారంలో ఉండగా ప్రజల అభిష్టాలను పరిగణంలోకి తీసుకోకుండా నియంతలా మారి తప్పులు చేయడం ఆ తరువాత ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించేసరికి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉబలాటంతో ప్రజలకు క్షమాపణలు చెప్పడం అధికారంలోకి వచ్చాకా మళ్ళీ అవే తప్పులని చేయడం చంద్రబాబు రాజకీయ చక్రంలో ఒక భాగంగా చెప్పచ్చు, దీనికి ఉదాహరణలు ఉన్నాయి.

గతంలో ఓక సందర్భంలో ముస్లిం వర్గం అందరు నన్ను క్షమించండి, మరెప్పుడూ బీజేపీతో కలవనన్న చంద్రబాబు మళ్లీ మోదీతో 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్ని ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఆడియొ విడియొ సాక్షిగా దోరికిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నేను ఏం తప్పు చేసానని కేసీఆర్‌ నన్ను తిడుతున్నాడు అంటూ మీటింగులు పెట్టారు. 2014 ఎన్నికల్లో గెలుపొందేందుకు నేను మారిన మనిషిని, గతంలో చేసిన తప్పులు చేయను , ఉద్యోగులు నన్ను క్షమించండి అని కోరి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులని ఇబ్బందులకు గురిచేశారు.

ఇలా బాబు అధికారంలో ఉన్నన్ని రోజులు నియంతలా భ్రమల్లో బ్రతుకుతూ తప్పులు చేయడం ఆ తరువాత ప్రజలు ఓటుతో వాత పెట్టే సరికి క్షమాపణలు కోరడం మళ్ళీ తప్పులు చేయడం ఆయనకి అలవాటనేది ఆయన రాజకీయ చరిత్ర చూస్తే అర్ధం అయ్యే విషయం. ప్రజలను గెలవాలి అంటే అధికారంలో ఉండగా వారికి సేవ చేయాలి కాని అధికారంలో లేని సమయంలో వారి దగ్గర సానుభూతి పొందే ప్రయత్నం చెయడం కాదని బాబు ఎప్పుడు తెలుసుకుంటారో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp