ఇండోనేషియాలో భారీ భూకంపం - కుప్పకూలిన భవనాలు

By Rishi K Jan. 15, 2021, 10:23 am IST
ఇండోనేషియాలో భారీ భూకంపం - కుప్పకూలిన భవనాలు

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా అనేక భవనాలు నేలమట్టం కాగా ఏడుగురు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కాగా శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాల్లోకి వెళితే ఇండోనేషియాలోని మజేన్ నగరానికి ఈశాన్యంగా ఆరు కిలోమీటర్లు దూరంలో సులవేసి దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం కారణంగా పలు భవనాలు కుప్పకూలగా శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

భూకంపం కారణంగా ఏడు సెకన్ల పాటు భూమి కంపించగా ప్రజలు భవనాల నుండి బయటకు పరిగెత్తారు. భూకంప తీవ్రతకు వెస్ట్ సులవేసి గవర్నర్ కార్యాలయం తీవ్రంగా దెబ్బతినగా ఒక హోటల్ పూర్తిగా నేలమట్టమైంది. నగరంలో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. కాగా శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంతకు ముందు రోజు అదే జిల్లాలో భూమి కంపించగా రిక్టర్ స్కేల్ మీద తీవ్రత 5.9 గా నమోదయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp