ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసు: టిడిపి మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్‌కు పోలీసులు షాక్

By Jagadish J Rao Jun. 06, 2020, 08:16 am IST
ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసు: టిడిపి మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్‌కు పోలీసులు షాక్

టిడిపి మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ కు పోలీసులు షాక్ ఇచ్చారు‌. ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో భార్గవ్ కు పోలీసులు నోటీసులిచ్చారు.

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టిడిపి నేత, ఏపి సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో ఇటీవల నలుగురు నిందితులను కడప పట్టణంలోని చిన్నచౌక్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే విచారణకు హాజరుకావాలని అఖిల ప్రియ భర్త భార్గవ్ కు నోటీసులిచ్చారు. గత నెల 15న మధ్యవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణను చిన్నచౌక్ పోలీసులు వేగవంతం చేశారు.

అయితే భార్గవ్ పై ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. 2019 అక్టోబర్ 8న హైదరాబాదులో కేసు నమోదైంది. అంతకు ముందే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఆళ్లగడ్డ ఎస్‌ఐ రమేశ్‌ కుమార్, గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న భార్గవ రామ్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఏపి పోలీసులు హైదరాబాదు వెళ్లగా అక్కడ తప్పించుకున్నాడు. దీంతో ఐపిసి సెక్షన్ 353, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం భార్గవ రామ్ పై దాఖలు అయింది హత్య కుట్ర కేసు. ఇది చాలా తీవ్రమైన కేసు. గతంలో పోలీసుల నుంచి తప్పించుకున్న భార్గవ్..ఇప్పుడు తప్పనిసరిగా హాజరుకావల్సి ఉంది.

టిడిపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్ పై అదే పార్టీకి చెందిన నేత ఏవి సుబ్బారెడ్డి ఇటీవలే సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరు తనను చప్పేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. వారి అనుచరులు రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సంజోరెడ్డితో చేతులు కలిపి తనను హతమార్చాలని చూస్తున్నారని అన్నారు. అంతే కాకుండా తనను చంప్పేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారని ఊహించని రీతిలో బాంబు పేల్చారు. దీనిపై కడప పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి కుట్రను భగ్నం చేసి తనను కాపాడారని తెలిపారు.

అనంతరం పోలీసులు విచారణలో నిందితులు పలు నిజాలను వెల్లడించారు. భూమా అఖిలప్రియ అనుచరుడు శ్రీను తమకు డబ్బులు ఇచ్చాడని నిందితులు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను చంపాలని చూస్తున్నారని, భూమా అఖిలప్రియ, భార్గవ రామ్ ని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఏవి సుబ్బారెడ్డి పోలీసులను కోరారు. కాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అఖిల ప్రియ భర్తపై ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయిన విషయం తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp