భూమి పూజ తర్వాత మోదీ ఉద్వేగభరిత ప్రసంగం

By Kotireddy Palukuri Aug. 05, 2020, 02:08 pm IST
భూమి పూజ తర్వాత మోదీ ఉద్వేగభరిత ప్రసంగం

రామ మందిరం నిర్మాణం తర్వాత దేశ ప్రతిష్ట యుగయుగాలకు నిలిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. భారతీయ మర్యాదకు శ్రీరాముడు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని మోదీ కొనియాడారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసే అవకాశం తనకు లభించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీరాముడి ప్రతి పని హనుమంతుడు పూర్తి చేశాడని మోదీ పేర్కొన్నారు. రామ మందిరం దేశ సంస్కృతికి అద్దం పడుతుందని ఆకాంక్షించారు.

మందిరం నిర్మాణం తర్వాత అయోధ్య రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని మోదీ పేర్కొన్నారు. యావత్‌ ప్రపంచం జానకిరాముడు కొలువైన అయోధ్య వైపు చూస్తోందన్నారు. భవిష్యత్‌లో దేశ విదేశాల నుంచి ప్రజలు అయోధ్యకు వస్తారని పేర్కొన్నారు. అయోధ్య ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాముడు దేశ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడని మోదీ అన్నారు. కోటాను కోట్ల భారతీయుల కల నెరవేరబోతోందన్నారు. దేశమంతా రామమయం అయిందన్నారు. భారతదేశ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యయం అని వ్యాఖ్యానించారు.

మోదీకి ముందు యూపీ సీఎం యోగి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఛీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా మాట్లాడారు. ఎందరో త్యాగాల ఫలితంగా రామ మందిరం నిర్మాణం సాధ్యమవుతోందన్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది రాలేకపోయారని గుర్తు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఐదు దశాబ్ధాల కల అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టమని యూపీ సీఎం యోగి వ్యాఖ్యనించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp