పిసిపిఐఆర్ లో కదలిక - ఏపీలో భారీగా పెట్టుబడులు

By Kotireddy Palukuri 12-11-2019 02:43 PM
పిసిపిఐఆర్ లో కదలిక -  ఏపీలో భారీగా పెట్టుబడులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో దఫా అధికారం చేపట్టిన తరవాత 2009లో రూపుదిద్దుకున్న పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (పిసిపిఐఆర్) లో మళ్ళీ కదలిక వచ్చింది. దాదాపు 3.4 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉన్న పిసిపిఐఆర్ ను ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరంలో ఏర్పాటు చేసేందుకు అప్పటి వైఎస్సార్ సర్కార్ ప్రణాళికలు రచించింది. విశాఖ పట్నం నుంచి కాకినాడ మధ్యలో ఏర్పాటు చేసే ఈ కారిడార్ పై వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంఓయూ జరిగింది. ఐతే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ పెట్టకపోవడంతో కారిడార్ పై కదలిక మందగించింది.   

తాజా రాష్ట్రంలో వైఎస్సార్ సిపి సర్కారు అధికారం చేపట్టడంతో ఈ కారిడార్ పై దృష్టి పెట్టింది. పిసిపిఐఆర్ వాల్ల  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పుంజుకోవడంతో పాటు భారీగా ఉద్యోగవకాశాలు ఏర్పడే అవకాశం ఉండడంతో జగన్ సర్కారు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సీఎం జగన్ ఈ కారిడార్ పై చర్చించినట్లు సమాచారం. కారిడార్ ను ఆచరణ లో పెట్టేందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

3.4 లక్షల పెట్టుబడులు పూర్తి స్థాయిలో పెట్టేందుకు దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల సమయం పెట్టె అవకాశం ఉంది. 2025 కల్లా 5 లక్షల కోట్లా ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదగాలన్నలక్ష్యం పెట్టుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి.. ఆ లక్ష్యం చేరుకోవాలంటే పెట్రో, కెమికల్ పరిశ్రమలో పెట్టుబడులే ప్రధాన అవకాశం అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా పిసిపిఐఆర్ పై ఆసక్తి చూపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.  కోస్తా తీరంలో సహజ వనరులు లభ్యత ఈ కారిడార్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్య కారణం. ఇదే విషయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ముంబైలో సోమవారం జరిగిన గ్లోబల్ కెమికల్స్, పెట్రో కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సదస్సు లో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలును మంత్రి వివరిస్తూ, పెట్టుబడిదారులకు రెడ్కార్పెట్ పరుస్తామని పేర్కొన్నారు. కేంద్రం కూడా ఆసక్తిగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.  

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News