పవన్ కళ్యాణ్ రాయలసీమ యాత్ర

By Amar S Dec. 02, 2019, 10:42 am IST
పవన్ కళ్యాణ్ రాయలసీమ యాత్ర

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన ఆత్మీయ యాత్ర పేరుతో రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జనసేన పార్టీని సీమలో బలోపేతం చేయడానికి పవన్ ఆరు రోజుల పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రజలతో పవన్ ముఖాముఖిగా మాట్లాడనున్నారు. సంక్షేమ పథకాల లబ్ది అర్హులకు అందించడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యం మూలంగా ఇబ్బందులు పడుతున్న వారిని జనసేన అధినేత కలవనున్నారని ఆపార్టీ నేతలు చెప్తున్నారు. ఆదివారం నిర్వహించిన రైల్వేకోడూరు సభలోనూ పవన్ సంచలన వ్యాఖ్యలే చేసారు. రాయలసీమవాసులకు ధైర్యం సరిపోక తనకు ఓటు వేయలేదన్నారు. అందుకే యువత అంతా ధైర్యాన్ని గుండెల్లో నింపుకోవాలన్నారు. పుస్తకాలు చదివితే ధైర్యం వస్తుందని, కచ్చితంగా ఇదే ప్రాంతంలో లైబ్రరీ కట్టిస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు తనకు గౌరవం ఇవ్వడం లేదన్న పవన్ కళ్యాణ్ తాను తనకు నచ్చినంత కాలం జగన్ రెడ్డి అనే పిలుస్తానన్నారు. ఓడిపోయినా తనను ఇంతగా అభిమానిస్తున్నందుకు మీ రుణం తీర్చుకుంటానన్నారు.

Read Also: బాబు, ఆర్కేకి హార్ట్ బ్రేకింగ్ న్యూస్...

హైదరాబాద్ లో ప్రియాంకరెడ్డి ఉదంతంపై స్పందించిన పవన్ కళ్యాణ్ 2017లో చంద్రబాబు హయాంలో జరిగిన చిన్నపిల్ల అత్యాచార ఘటనలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జగన్ కి ప్రత్యేకహోదా అడిగే ధైర్యం లేదని పవన్ ఎద్దేవా చేసారు. ఆదివారం రాయలసీమలో అడుగుపెట్టిన పవన్ కు పెద్దఎత్తున ఘనస్వాగతం లభించింది. ఈ క్రమంలో పవన్ పర్యటనలో జేబు దొంగలు హల్‌చల్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగాఅభిమానులు ఎక్కువ మంది గుమ్ముగూడటంతో తోపులాట జరిగింది. ఇదే అదనుగా జేబు దొంగలు.. సుమారు 40 మంది పర్సులు, ఫోన్లు కొట్టేశారు. అంతేకాకుండా జనసేన ముఖ్యనేతల ఫోన్లు కూడా మాయమైనట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన.

ఆత్మీయ యాత్రలో భాగంగా పవన్ సోమవారం తిరుపతికి రానున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్‌ నాయుడు, జిల్లా నాయకులు కిరణ్‌రాయల్‌ తెలిపారు. సోమవారం ఉదయం తిరుపతి కెన్సస్‌ హోటల్లో తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తార, అలాగే 3న మంగళవారం ఉదయం 10.30గంటల నుంచి అదే హోటల్లో కడప, రాజంపేట పార్లమెంటరీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 4న బుధవారం పవన్‌కళ్యాణ్‌ తిరుపతి నుంచి భాకరాపేట, పీలేరు మీదుగా మదనపల్లికి చేరుకుంటారని తెలిపారు. మదనపల్లిలో సమావేశం అనంతరం రాత్రి హార్స్‌లీ హిల్స్‌లో బస చేస్తారన్నారు. 5న ఉదయం మదనపల్లి హార్స్‌లీహిల్స్‌ నుంచి అనంతపురం జిల్లా హిందూపురం వెళతారని వెల్లడించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp