కర్నూలు కార్పోరేషన్ ముఖచిత్రం !

By Chari.Ch Feb. 22, 2021, 03:00 pm IST
కర్నూలు కార్పోరేషన్ ముఖచిత్రం !

ఏపీలో పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. రేపు మున్సిపల్ ఎన్నికల పర్వానికి తెరలేవనుంది. దీంతో ఏపీలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఆయా పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై దృష్టిసారించాయి. అభ్యర్థులు ఖరారులో నిమగ్నం అయ్యాయి. అయితే అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులు విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో రాయల సీమ ముఖద్వారం, సీమలో ఏర్పడిన మొదటి కార్పోరేషన్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఓ లుక్కేద్దాం !

కర్నూల్ కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిగా వైసీపీ బీవై రామయ్య పేరును పరిశీలిస్తుందన్న వార్తలు ప్రస్తుతం కర్నూలు కార్పోరేషన్ ఎన్నికలు హాట్ టాపిక్ గామారాయి. జగన్ అభ్యర్థిని ప్రకటిస్తే అది రామయ్య అయినా, లేక ఇంకెవరైనా వైసీపీలో ఎలాంటి అసంతృప్తి వ్యక్తం కావు. అంటే పార్టీ పరిస్థితి కర్నూలులో మెరుగ్గాఉంది. కానీ టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్,బీజేపీ, పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కర్నూలు కార్పోరేషన్ పరిధిలో 54 డివిజన్లున్నాయి. అందులో కర్నూలు సిటీలో 39 డివిజన్లు, పాణ్యం, కోడుమూరు అసెంబ్లీ పరిధిలోకి వచ్చే డివిజన్లు 15ఉన్నాయి. అంటే మూడు నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు దీనిపై పట్టు ఉంటుంది. అయితే ముందే అనుకున్నట్లు వైసీపీకి అధిష్టానం నిర్ణం శిరోధార్యం.

Also Read:కర్నూల్ మేయర్ పీఠం బీవై రామయ్యకేనా?

కాని టీడీపీ విషయానికి వస్తే మాత్రం మేయర్ కోడుమూరు పరిధిలో కోట్లు జయసూర్య ప్రకాశ్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి, పాణ్యం పరిధిలో ఏరాసు ప్రతాప్ రెడ్డి, గౌరు వెంకట్ రెడ్డిలు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కర్నూలు సిటిలో ఎలాగూ కేఈ ఉండనే ఉన్నారు. అంటే ఇంతమంది కలిసి పనిచేస్తేనే కార్పోరేషన్ జెండా ఎగురుతుంది. కానీ అది సాధ్యమా? ఇంతమందిని సమన్వయం చేసుకొని కర్నూలు కార్పోరేషన్ బరిలో పార్టీని టీడీపీని గెలిపించుకునే నాయకుడు ఉన్నారా? అంటే సమాధానం లేదనే వస్తుంది.

జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి ఉన్నా ఎన్నికల వేళ ఆయన మాట ఎవరు వింటారనేది కూడా ప్రశ్నార్ధకమే.గెలుపు మీద ఆశ లేకున్నా మేయర్ పీఠం మాకంటే మాకు అంటూ పోటీపడుతున్నారు,ఇది టీడీపీ అధిష్టానానికి మరో పెద్ద తలనొప్పి కానుంది. అదే సమయంలో గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న టీజీవెంకటేశ్ వర్గం టీడీపీలో ఉండనే ఉంది. మేయర్ అభ్యర్ధిని పక్కన పెడితే డివిజన్లకు అభ్యర్థుల ఖరారే చంద్రబాబుకు శిరోభారంగా మారనుంది.

మరోవైపు.. కర్నూలు కార్పోరేషన్ పరిధిలో ఇప్పుడిప్పుడే అదీ టీజీ వెంకటేష్ చేరికతో బీజేపీ పుంజుకుంటోంది.అయితే దానికి మేయర్ పదవిపై ఆశలు లేవనే చప్పాలి. కాకపోతే కనీసం మూడు నుంచి ఐదు డివజన్లైనా గెలుచుకోవాలని కమల నాథులు టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్తితిలును బట్టి ,టీజీ వెంకటేష్ బలం ఆధారంగా కార్పోరేషన్ పరిధిలో ఓ మూడు సీట్లైనా దక్కవచ్చంటున్నారు పరిశీలకులు.

Also Read:చివరకు బాండ్ పేపర్ కూడా ఓట్లను రాల్చలేదు.

ఇక గత ఎన్నికల్లో ఎనిమిది డివిజన్లను కైవసం చేసుకున్న సీపీఎం పరిస్థితి అంత మెరుగ్గా లేదని సమాచారం. కాకపోతే కార్పోరేషన్లో తన పట్టును నిలుపుకునేందుకు సీపీఎం శతవిధాల ప్రయత్నిస్తుందంటున్నారు పరిశీలకులు.అయితే గతంలో వచ్చనన్ని సీట్లు రావడం కష్టమని,ఒకటి లేదా రెండు స్టీట్లతో బోణి కొట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇంకోవైపు.. కోట్ల హయాంలో కర్నూలు కాంగ్రెస్ కు కంచు కోట. అలాంటిది ప్రస్తుంత కాంగ్రెస్ కు నేను ఉన్నాను అని చెప్పుకునే నాయకుడే కరువు. కోట్ల తనయుడు మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎమ్మెల్సీ సుదాకర్ బాబుసైతం ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. కోట్లతో అనుబంధం ఉన్న సీనియర్ లీడర్లు ప్రస్తుతం రాజకీయాలలో యాక్టివ్ గా లేరు. సో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరమే. మొత్తానికి కర్నూలు కార్పోరేషన్ పై అధికార వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు పరిశీలకులు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp