మ‌ళ్లీ సీన్ లోకి ప‌ర‌కాల‌..!

By Siva Racharla 14-11-2019 08:21 AM
మ‌ళ్లీ సీన్ లోకి ప‌ర‌కాల‌..!

ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో చాలాకాలంగా నానుతున్న ఈ పేరు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈసారి ఆయ‌న టీవీ తెర‌మీద ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. గ‌తంలో ఆయ‌న ఈటీవీ ప్ర‌తిధ్వ‌ని కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి తెలుగు టీవీ ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. ఆ త‌రువ‌తా వ‌రుస‌గా బీజేపీ, ప్ర‌జారాజ్యం చివ‌ర‌గా టీడీపీకి స‌న్నిహితంగా మెలిగారు. గ‌డిచిన సంవ‌త్స‌రన్న‌ర కాలంగా తెరువెనుక ఉన్నారు. ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారుడిగా చంద్ర‌బాబు హ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ప్ర‌స్తుతం సొంత వ్య‌వ‌హారాల్లో సాగుతున్నారు. 

కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త‌గా ఉన్న ప‌ర‌కాల ఇటీవ‌ల ఆర్థిక వ్య‌వ‌హారాల విష‌యంలో పీవీ న‌ర‌సింహ‌రావు విధానాల గురించి చేసిన ప్ర‌స్తావ‌న చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. త్వ‌ర‌లో మ‌ళ్లీ ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ టీవీ తెర‌మీద ద‌ర్శ‌నం ఇవ్వ‌డానికి రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు మ‌హా టీవీ వ‌ర్గాలు చెబుతున్నాయి. తొలుత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఇనుగంటి వెంక‌ట్రావు సార‌ధ్యంలో వ‌చ్చిన మ‌హాటీవీ ఆ త‌ర్వాత మాజీ కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి ఆధ్వ‌ర్యంలోకి మారింది. ప్ర‌స్తుతం మ‌రో జ‌ర్న‌లిస్ట్ మారెళ్ల వంశీకృష్ణ ఎండీగా ఈ చానెల్ న‌డుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్ర‌కాశం జిల్లాకి చెందిన ఓ నాయ‌కుడి అండ‌దండ‌ల‌తో మ‌హాటీవీని వంశీ న‌డుపుతున్న‌ట్టుగా మీడియా వ‌ర్గాల్లో ప్ర‌చారం.

టీడీపీని వీడి బీజేపీలో చేరిన సుజ‌నా చౌద‌రి మ‌ళ్లీ సొంతంగా మీడియా మ‌ద్ధ‌తు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీకి మ‌హాటీవీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న అంచ‌నాకు వ‌చ్చారు. దానికి అనుగుణంగా మ‌ళ్లీ మ‌హాటీవీని సొంతం చేసుకుని తిరిగి ప‌ట్టాల మీద‌కు తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. దానికి అనుగుణంగానే ఆ బాధ్య‌త‌ను ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ కి అప్ప‌గించిన‌ట్టు క‌నిపిస్తోంది. మ‌హాటీవీలో ప్ర‌స్తుతం ప‌లు మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. వ‌చ్చే నెల మొద‌టి నుంచి కొత్త టీమ్ తో మ‌హాటీవీ ముందుకు రాబోతోంద‌ని చెబుతున్నారు. ప‌ర‌కాల కార్యాల‌యంలోనే ఇంట‌ర్య్యూలు నిర్వ‌హించి ప‌లువురు జ‌ర్న‌లిస్టుల‌ను నియ‌మిస్తున్న నేప‌థ్యంలో నేరుగా ప‌ర‌కాల స్క్రీన్ మీద‌కు వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని అంతా భావిస్తున్నారు. అయితే ఆయ‌న ఆఫ్ ది స్క్రీన్ న‌డిపిస్తారా లేక మ‌ళ్లీ నేరుగా తెర‌మీద‌కు వ‌చ్చేస్తారా అన్న‌ది త్వ‌ర‌లో తేల‌బోతోంది. అదే స‌మ‌యంలో ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారాల‌ని భావిస్తున్న సుజ‌నాకి మ‌హాటీవీ ఏమేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న‌ది కూడా చ‌ర్చ‌నీయాంశ‌మే.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News