కుటుంబరావు ఏం చేస్తున్నారో తెలుసా..?

By Kotireddy Palukuri Jul. 10, 2020, 09:50 am IST
కుటుంబరావు ఏం చేస్తున్నారో తెలుసా..?

చెరుకూరి కుటుంబరావు.. ఈ పేరు చంద్రబాబు ప్రభుత్వంల మారుమోగింది. రాజకీయ నాయకుడు కాకపోయినా.. అంతకు ముందు రాష్ట్ర ప్రజలకు పరిచయం లేకపోయినా బాబు హాయంలో మంత్రులు, టీడీపీ అధికార ప్రతినిధుల కన్నా ఈయనే ఎక్కువగా టీవీ ఛానెళ్లలో కనిపించేవారు. స్టాక్‌ బ్రోకర్‌ అయిన చెరుకూరి కుటుంబరావును చంద్రబాబు తన హయాంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా నియమించారు. ఆర్థికపరమైన సలహాలు, అప్పులు చేయడంతోపాటు అమరావతి బాండ్స్‌ పేరిట తొలసారి స్టాక్‌మార్కెట్‌ నుంచి అప్పులు సేకరించిన ఘనతలో కుటుంబరావుదే కీలక పాత్ర.

కుటుంబరావు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా మాత్రమే పని చేసి ఉంటే ఆయనను ఇప్పుడు గుర్తుచేసుకోవాల్సిన పనిలేదు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఆయన తెలుగుదేశం పార్టీ నేతగా వ్యవహరించారు. ప్రభుత్వంపై వివిధ పథకాలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై వచ్చే విమర్శలు, ఆరోపణలకు కుటుంబరావు సమాధానాలు ఇచ్చేవారంటే ఆయన ఎలా పని చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్న నేతల కన్నా.. తాను తెచ్చిపెట్టుకున్న వారే అంతా తామై చక్రం తిప్పారు. నారాయణ విద్యాసంస్థల అధిపతిగా ఉన్న పి. నారాయణను ఎవరూ ఊహించని విధంగా మంత్రిని చేశారు. ఇలాగే కుటుంబ రావును కూడా. వీరిద్దరూ బాబు హయాంలో అంతా తామై నడిపించారు.


బాబు హాయంలో ఆ స్థాయిలో చక్రం తిప్పిన వీరిద్దరూ ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. నారాయణ ఎప్పటిలాగే తన విద్యా వ్యాపారం చూసుకుంటున్నారు. ఇక చెరుకూరి కుటుంబరావు కూడా తిరిగి తన పూర్వ స్థితికి వెళ్లారు. మళ్లీ స్టాక్‌ బ్రోకర్‌ అవతారం ఎత్తారు. స్టాక్‌మార్కెట్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి..? ఏ కంపెని షేర్లు కొంటే లాభం వస్తుంది..? ఎప్పుడు కొనాలి..? అనే సలహాలు ఇస్తూ చంద్రబాబుకు, టీడీపీకి దూరంగా ఉంటున్నారు. స్టాక్‌ బ్రోకర్‌గా సలహాలు తన క్లయింట్లకే కాదు టీవీ ఛానెళ్లలో మాట్లాడుతూ ఏ కంపెనీ షేర్లు కొనాలో చెబుతున్నారు. టీవీ ఛానెల్‌లో కుటుంబరావును చూసిన వారు.. ఎంతలో ఎంత మార్పు..? అనుకుంటున్నారు. నిన్నటి వరకూ రాజకీయ నాయకుడిగా చెలామని అయిన కుటుంబరావు నేడు స్టాక్‌ బ్రోకర్‌గా తన పూర్వాశ్రమానికి వెళ్లడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp