ఈ సారి ‘ఈశాన్యం’ వంతు

By Jaswanth.T Oct. 28, 2020, 06:46 pm IST
ఈ సారి ‘ఈశాన్యం’ వంతు

ఇప్పటి వరకు నైరుతి రుతుపవనాలకారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కుమ్మేసాయి. యేడాదిపాటు కురవాల్సిన వర్షం కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే కురి దాదాపు యాభై అరవయ్యేళ్ళ నాటి రికార్డులను తిరిగి నమోదు చేసుకున్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా నిష్క్రమిస్తున్నాయి.
వీటి నిష్క్రమణతో పాటే ఈశాన్యరుతు పవనాలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

వస్తూనే ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఉపరితల ఆవర్తనంను తీసుకువచ్చాయని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. మధ్య బంగాళాఖాతం, ఆగ్రేయ బంగాళాఖాతాలను ఆనుకుని ఏర్పడిన ఈ ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు చోట్ల రానున్న 48 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తేల్చారు. కోస్తా ఆంధ్రతోపాటు విస్తారంగాను, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడతాయంటున్నారు. ఈశాన్య రుతుపవనాల రాకను ఖరారు చేస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆకాశం మేఘావృతమైఉంది.

అయితే నైరుతి నిష్క్రమణ సందర్భంగా కురిసిన భారీ వర్షాలకు ఏర్పడ్డ ముంపు ఇంకా ఉభయ తెలుగు రాష్ట్రాలను వీడనేలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి వర్షాలు అంటే రైతులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp