కరోనాను జయించిన తైవాన్

By Krishna Babu Oct. 30, 2020, 08:45 pm IST
కరోనాను జయించిన తైవాన్

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచాన్ని మొత్తం మహమ్మారిలా కమ్మేసిన కరోనా వైరస్ ఇప్పటికే 4.49కోట్ల మందిపైగా సోకింది, మరణాల సంఖ్య 11.81 లక్షలకు చేరుకుంది. ఈ మహమ్మారి నుండి విముక్తి పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారి కోసం తీవ్రంగా కృషిచేస్తున్నా ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలు రాలేదు. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తయారై ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఏ ప్రభుత్వాలు నిర్ధిష్టంగా చెప్పలేకపొతున్నాయి. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ కూడా ప్రబలటం మొదలైందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో తైవాన్ దేశం కరోనా పై కీలక ప్రకటన చేసింది.

కరోనా మహమ్మరిని తమ దేశం సమర్ధవంతంగా ఏదుర్కుని దానిపై విజయం సాదించినట్టు తైవాన్ దేశం ప్రకటించింది. 2.3 కోట్ల మంది జనాభా కలిగిన తైవాన్ దేశంలో కరోనా వ్యాపించిన తోలి నాల్లలో మోత్తం 553 పాజిటివ్ కేసులు నమొదయ్యాయని, పాజిటివ్ వచ్చిన వారిలో కేవలం ఏడుగురు మాత్రమే మరణించారని, చివరి కరోనా కేసు ఏప్రిల్ 12న నమోదైందని.. ఆ తరువాత గడచిన 200 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది.

మహమ్మారిపై తాము సాధించిన ఈ విజయం కేవలం తాము తీసుకున్న ముందస్తు జాగ్రత్త వలనే అని, కరోనా ప్రభలతుందనే వార్తలు వచ్చిన వెంటనే సరిహద్దులు మూసివేయడం, ప్రజలని అప్రమత్తం చేయడం, కాంట్రాక్ట్ ట్రేసింగ్, వేగంగా నిర్ధారణ పరీక్షలు , కచ్చితమైన క్వారంటైన్ నిబందలను పాటించి వైరస్ వ్యాప్తికి బ్రేకులు వేశామని పేర్కొంది. అయితే గతంలో న్యూజిలాండ్ దేశం కూడా తామూ కరోనా వైరస్ ను జయించినట్టు చెప్పుకోచ్చినా ఆ తరువాత తిరిగి కరోనా వైరస్ ఆ దేశ ప్రజలకు సోకిన నేపధ్యంలో తైవాన్ దేశం తిరిగి మహమ్మారి సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp