రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం

By Kiran.G Sep. 20, 2020, 05:50 pm IST
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం

విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లులు పెద్దల సభ ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు.

కాగా ఏకపక్షంగా వ్యవహరించి ప్రజాస్వామ్య సంప్రదాయాలకు డిప్యూటీ ఛైర్మన్ తూట్లు పొడిచారని విపక్షాలు ఆరోపిస్తూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్‌ ప్రజాస్వామిక విలువలకు తూట్లుపొడిచారని విపక్షాలు ఆందోళన చేసాయి.

బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సమమయంలో సభ రేపటికి వాయిదా వేయాలని కోరినప్పటికీ డిప్యూటీ ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరించారని దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజని కాంగ్రెస్ ఎంపీ అహ్మద్‌ పటేల్‌ అన్నారు. వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు డిప్యూటీ చైర్మన్ సహకరించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp