నేను నా కార్యకర్త, ఎమ్మెల్యే కోటంరెడ్డి భారీ పాదయాత్ర...!

By Venkat G Sep. 15, 2021, 05:00 pm IST
నేను నా కార్యకర్త, ఎమ్మెల్యే కోటంరెడ్డి భారీ పాదయాత్ర...!

రాజకీయాల్లో గెలుపు ఓటములు పక్కన పెడితే గెలిచినా ఓడినా సరే ప్రజల్లో ఉండటం అనేది ఒక ప్రత్యేకత. ఓటమిని అయినా గెలుపుని అయినా సరే సమాన దృష్టి తో చూడగలిగే వాడే రాజకీయ నాయకుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఏమో గాని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు ఇలాంటి నాయకులు మనకు కనపడుతూ ఉంటారు. తెలంగాణాలో కొందరు మంత్రులు ఇలాగే ప్రజల్లో ఉంటారు. ఏపీలో అధికార, విపక్షాల్లో కూడా ఇలాంటి నాయకులు మనకు కనపడుతూ ఉంటారు.

అందులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. గెలిచినా ఓడినా సరే... పదవులతో సంబంధం లేకుండా ఆయన ప్రజల్లోనే ఉంటారు. వైఎస్ మీద ఉన్న అభిమానం తో జగన్ పై ఉన్న నమ్మకంతో వైసీపీలోకి వచ్చిన ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తన మార్క్ వేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆయనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. ఆయనను వివాదాస్పద వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేసినా సరే ఆయన మాత్రం ప్రజల్లో ఉంటూ వారితో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

Also Read : చెవిరెడ్డి రూటే సపరేటు.....

ఇప్పుడు మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన. కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు అని గ్రహించిన ఆయన వారితో మమేకమై సమస్యలను పరిష్కరించేందుకు సిద్దమవుతుంది. రేపటి నుంచి అంటే ఈ నెల 16 నుంచి నేను... నా కార్యకర్త అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దం అయ్యారు. కార్యకర్తలు, నేతల నివాసానికి వెళ్తాను అని ఆయన స్వయంగా ప్రకటించారు. కార్యాలయ వర్గాలు తెలిపారు. సుమారు 42 రోజుల పాటు పాదయాత్ర పేరుతో శ్రీధర్ రెడ్డి కార్యకర్తల్లో ఉంటారు.

కార్యకర్తల నివాసంలోనే భోజనం కూడా చేస్తారు ఆయన. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. తనను గెలిపించిన కార్యకర్తల ఋణం తీర్చుకోవడానికి ఆయన సిద్దమవుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మొత్తం 26 డివిజన్ల పరిధిలో 42 రోజుల పాటు దాదాపు 3500 కార్యకర్తల నివాసానికి ఆయన వెళ్తారు. కార్యకర్తల కష్టాలు, కరోనా సమయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటారు.

Also Read : బాబు మర్చిపోయారు.. జగన్ చేసి చూపించారు!

అదే విధంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి ఏంటీ అనేది కూడా ఆయన తెలుసుకుంటారు. అధికారుల ప్రవర్తన, స్థానిక నాయకులు ఎంత వరకు అందుబాటులో ఉంటున్నారు, వాలంటీర్ ల పని తీరు ఎలా ఉంది లాంటి అనేక సమస్యలను కార్యకర్తలను అడిగి ఆయన స్వయంగా తెలుసుకుంటారు. కరోనా సమయంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు కూడా ఆయన అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో కార్యకర్తల ఇంట్లోనే ఆయన భోజనం చేస్తారు. సిఎం వైఎస్ జగన్ మద్దతుతో తాను ఇంతటి వాడిని అయ్యా అని... జగన్ ఉంచిన నమ్మకంతో కార్యకర్తలు తనను భుజాల మీద మోసి ఎమ్మెల్యే గా వరుసగా గెలిపిస్తున్నారని కోటంరెడ్డి అంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp