సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ

By Kotireddy Palukuri May. 23, 2020, 07:31 pm IST
సీఎం జగన్‌కు నారా లోకేష్‌ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మాజీ మంత్రి నారా లోకేష్‌ హైదరాబాద్‌ నుంచి లేఖ రాశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు బీమా కల్పించాలని ఆయన తన లేఖలో కోరారు. కరోనా విధుల నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను కాపాడుకోవాలన్నారు. వారి కృషిని గుర్తించి ప్రధాని గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కింద బీమా అందించాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌ వర్కర్లకు ఈ పథకం కింద కల్పిస్తున్న బీమాలో అంగన్‌వాడీలకు చోటు లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అంగన్‌వాడీలకు 50 లక్షల రూపాయల బీమా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌ తన లేఖలో కోరారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp