బీజేపీలో చేరిన మరో హీరోయిన్...

By Amar S 02-12-2019 07:22 AM
బీజేపీలో చేరిన మరో హీరోయిన్...
సినీ నటి నమిత బీజేపీలో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు.పెళ్లి చేసుకున్న తర్వాత నమిత 2016 లో అన్నాడీఎంకేలో చేరారు. మళ్లీ శనివారం బీజేపీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నమిత పోటీ చేస్తారని సమాచారం.
గుజరాత్ కు చెందిన నమిత మిస్ సూరత్ గా ఎన్నికవవటంతో సినిమా అవకాశాలు వచ్చాయి.నమిత తెలుగు,తమిళంలో పలు సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో జెమినీ, సొంతం, సింహా, ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి, బిల్లా వంటి పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News