నియోజకవర్గ ప్రజల కోసం కోవిడ్ ఆసుపత్రి సిద్ధం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే

By Voleti Divakar May. 04, 2021, 10:55 am IST
నియోజకవర్గ ప్రజల కోసం కోవిడ్ ఆసుపత్రి సిద్ధం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే

ప్రజా ప్రతినిధులు అంటే.. ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించడమే కాదు.. ప్రజలు కష్టాల్లో ఉంటూ ఆదుకునేవారని నిరూపిస్తున్నారు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు. కరోనా కష్టకాలంలో తమ నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు కల్పిస్తూ వారిలో భరోసాను నింపుతున్నారు. కోవిడ్‌ బాధితుల కోసం సొంత నిధులుతో ప్రత్యేక ఆస్పత్రులను సిద్ధం చేయడం లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్, వెంటిలేటర్‌ సౌకర్యాలు కల్పించడం చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చేవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 150 ఆక్సిజన్‌ బెడ్లు, పది వెంటిలేటర్లు సమకూర్చగా.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ 150 పడకలతో కోవిడ్‌ బాధితులకు ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు.

కోవిద్ బాధితులు ఆక్సిజన్ కొరత కారణంగా ఊపిరి కోల్పోతున్న నేపథ్యం లో మైలవరం నియోజకవర్గానికి మాత్రం వసంత కృష్ణ ప్రసాద్ ఆక్సిజన్ అందించనున్నారు.కోవిద్ వ్యాప్తి భారీగా ఉన్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజలు ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు బలి కాకూడదన్న ఒక మంచి సంకల్పం తో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తీసుకున్న ఆ నిర్ణయం కరోనా బాధితుల ప్రాణాలు నిలబెట్టనుంది.

150 పడకలతో ప్రత్యేక ఆసుపత్రి ఆయన ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గ ప్రజల కోసం సిద్ధం చేస్తున్నారు.కరోనా ఆసుపత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బెడ్ల కు ఆక్సిజన్ సిలిండర్ లు కాకుండా నేరుగా పైపు లైన్ ఏర్పాటు చేస్తున్నారు . మరికొద్ది రోజుల్లోనే ఈ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నేడు వసంత కృష్ణ ప్రసాద్.. కరోనా కాలంలో నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నారు. వీరి బాటలో మరికొంత మంది ఎమ్మెల్యేలు నడిచే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp