ఆ ఛానెల్ చూస్తే నెలకు రూ500 ..

By Voleti Divakar Jun. 23, 2021, 08:30 am IST
ఆ ఛానెల్  చూస్తే నెలకు రూ500 ..

అదే పనిగా ఒకే ఛానెల్ చూసినా నెలవారీ డబ్బులు ఇస్తారా ? ! . ఇస్తారు . అయితే ఇక్కడ కాదు . ముంబయ్ , డిల్లీ వంటి నగరాల్లో . ఒకే చానల్ ను చూస్తే ముంబయ్ , డిల్లీ వంటి నగరాల్లో నెలకు రూ . 500 చొప్పున చెల్లించే స్కీమ్ అమలు చేసి , రిపబ్లిక్ టీవీ యజమాన్యం టిఆర్ పి స్కామ్ లో దొరికిపోయింది .

బిజెపికి అనుకూలమైన రిపబ్లిక్ టీవీ యాజమాన్యం టెలివిజన్ రేటింగ్ పాయింట్ ( టిఆర్ పి ) ని పెంచుకునేందుకు ముంబయ్ , డిల్లీ వంటి ప్రాంతాల్లో వీక్షకులకు నెలకు రూ . 500 చొప్పున చెల్లించి నిరంతరం తమ చానల్న చూసే విధంగా కుంభకోణానికి పాల్పడినట్లు ముంబయ్ పోలీసులు గత ఏడాది కేసు నమోదు చేశారు. ఈ కేసులో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ , ప్రముఖ పాత్రికేయుడు అర్జబ్ గోస్వామితో పాటు ఆచానెల్ కు చెందిన మరో ముగ్గుర్ని నిందితులుగా పేర్కొంటూ తాజాగా పోలీసులు ముంబయ్ లోని ఎక్స్టెనేడ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు .

ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో 15 మందిపై చార్జీషీటు దాఖలైంది .
గత మార్చిలో అర్థబను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్టు చేశారు . అతరువాత ఆయనకు ముంబయ్ హైకోర్టులో ఊరట లభించింది . ఈ సందర్భంగా అర్థబ్ మహారాష్ట్రలోని శివ సేన ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు . తాజాగా ఆయనను నిందితుడిగా చేర్చడం , ఆయనపై మోసం , ఫోర్జరీ , కుట్ర తదితర అభియోగాల కింద కేసు నమోదు చేశారు .
ఇదీ జరిగింది !

చానెళ్లను ప్రజలు వీక్షించే సమయం ఆధారంగా ( టిఆర్‌ ) ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ప్రకటనలు , ఆయా ప్రకటనలకు ధరలు నిర్ణయిస్తాయి . బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది . బార్క్ నియమించిన హన్నా సంస్థ ఎంపిక చేసిన గృహాలకు బారో మీటరు బిగించి , వారు ఏ చానెళ్లు చూస్తున్నారన్నది గుర్తించి , దాని ఆధారంగా టి ఆర్ పిని నిర్ణయిస్తుంది . అయితే రిపబ్లిక్ టీవీ యాజమాన్యం బార్క్ , హన్సా సంస్థలతో కుమ్మక్కై ఏ ఇంట్లో బారో మీటరు బిగించారో ఆఇంట్లో నిరంతరం రిపబ్లిక్ చానెల్ చూసేలా ఒప్పందం చేసుకున్నారు .

ఇందుకోసం బారోమీటర్ ఉన్న ఇళ్ల వారికి నెలకు రూ . 500 లంచం చెల్లించేలా ఒప్పించారు . తద్వారా ప్రకటనల ఆదాయం రూపంలో రిపబ్లిక్ టీవీకి లబ్ది చేకూరిందన్నది ఆరోపణ . ఈ కుంభకోణంలో బార్క్ సిఇఓ పారో ముఖర్జీను సూత్రధారిగా , హన్సా సంస్థ ఉద్యోగులు , సిబ్బందిని పాత్రధారులుగా పోలీసులు గుర్తించారు . ఈ వ్యవహారం కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతుండగా ముంబయ్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు .

పాపం ప్రముఖ జర్నలిస్టు !

ప్రముఖ జర్నలిస్టు , రిపబ్లిక్ చీఫ్ ఎడిటర్ అర్జబ్ గోస్వామి బిజెపికి బహిరంగంగా తొత్తుగా మాట్లాడేవాడు . టిఆర్ పి రేటింగ్ స్కామ్ తన చానెల్ పై కేసు నమోదు చేసిన సందర్భంగానూ , తన అరెస్టు సందర్భంగానూ ఆయన ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ ్బర్ సింగ్ ను ఏకవచనంతో సంభోధిస్తూ చేసిన వ్యాఖ్యలు బిజెపి అభిమానులకు మినహా మిగిలిన వారికి కాస్త జుగుప్సను కలిగించాయి . మహారాష్ట్రలోని శివ సేన ప్రభుత్వం , పోలీసులు తమను ఏమీ చేయరన్నట్లు ఆయన మాట్లాడారు .

2018 లో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటీరియర్ డిజైనర్ అన్వయ నాయక్ , ఆయన తల్లి ఆత్మహత్య కేసులో మహారాష్ట్రలోని ఆలీబాగ్ పోలీసులు అర్జలను అరెస్టు చేశారు . ఈ కేసులో ఆయనకు వ్యాయస్థానాలు బెయిల్ కూడా నిరాకరించాయి . తమ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ నాయక్ లేఖ రాశారు . దాని ఆధారంగా అర్థ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు .

అరెస్టు సందర్భంగా కూడా అర్జబ్ తన అహంకారాన్ని , ధిక్కారాన్ని ప్రదర్శించడం గమనార్హం . విలేఖర్లను ఎక్కడికక్కడ మొహరింపజేసి ,తన అరెస్టును దేశ సమస్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఎక్కడైతే ఆయన వివిధ అంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహించారో అక్కడే తన విడుదల గురించి డిబేట్లు జరిపించాల్సి వచ్చింది .

ఆనాడు ఆర్ణబ్ ను ఆకస్మికంగా అరెస్టు చేయడాన్ని ఖండించిన ఎడిటర్స్ గిల్డ్ , న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ ఆయన తరహా జర్నలిజాన్ని మాత్రం సమర్థించడం లేదని స్పష్టం చేయడం కొసమెరుపు . మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన చానెళ్లు ఏవీ ఆయనకు మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp