అస్వస్థత నుంచి కోలుకున్న రాజుగారు

By Karthik P Dec. 16, 2020, 03:02 pm IST
అస్వస్థత నుంచి కోలుకున్న రాజుగారు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారం వాస్తవమేని తేలింది. రఘురామకృష్ణం రాజు తీవ్ర అస్వస్థతకు గురవడంతో గుండెకు శస్త్ర చికిత్స జరిగిందంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి. తన ఆరోగ్యంపై ప్రచారం జరుగుతుండడంతో రఘురామ కృష్ణం రాజు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకు బైపాస్‌ సర్జరీ జరిగిందని ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపారు.

గుండెకు సంబంధించిన సమస్య రావడంతో.. పరీక్షలు చేయించుకున్నానని రఘురామకృష్ణం రాజు ఆ వీడియోలో వెల్లడించారు. స్టంట్‌ తో సరిపోతుందనుకున్నా.. బైపాస్‌ చేయడం వల్ల మంచిఫలితం వస్తుందని చేయించుకున్నట్లు వివరించారు. ముంబైలో తనకు శస్త్ర చికిత్స జరిగినట్లు తెలిపారు. రేపు డిశ్ఛార్జి కాబోతున్నట్లు చెప్పారు. కోలుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని రఘురామకృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన పడొద్దని, కోలుకునే వరకూ సోషల్‌ మీడియా ద్వారా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

తన ఆరోగ్యంపై వైసీపీ సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారం చేసిందంటూ రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా తనను ఏమీ చేయలేరన్నారు. ఎప్పుడూ దూకుడుగా, గట్టిగా మాట్లాడే ఎంపీ బైపాస్‌ సర్జరీ కావడంతో నిదానంగా, ఆవేశానికి లోనుకాకుండా మాట్లాడారు.

Read Also ; పార్లమెంట్‌ను తాకిన రైతు ఉద్యమం.. శీతాకాల సమావేశాలు రద్దు..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp