లాక్ డౌన్ చేసిన మంచి.. అతి పొడవైన రైల్వే వంతెనకు కొత్త హంగులు

By Voleti Divakar May. 22, 2020, 09:30 am IST
లాక్ డౌన్ చేసిన మంచి.. అతి పొడవైన రైల్వే వంతెనకు కొత్త హంగులు

ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొనే రాజమహేంద్రవరంలో గోదావరిపై నిర్మించిన రోడ్డు కం రైలు వంతెన భారతదేశంలోనే 3వ అతిపొడవైన రోడ్డు కం రైలు వంతెన. ఈ వంతెన పొడవు 3 కిలోమీటర్లు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వంతెన మరమ్మతులకు రైళ్లు, వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడటంతో ఏళ్ల నుంచి తాత్కాలిక మరమ్మత్తులతో సరిపెట్టారు. కోవిడ్-19 రోడ్డు కం రైలు వంతెన ఆధునీకరణ, మరమ్మత్తులకు ఆస్కారం కల్పించింది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో రైళ్లు, వాహనాల రాకపోకలు సుమారు 2నెలలుగా నిలిచిపోయారు. దీన్ని అవకాశం తీసుకున్న రైల్వే అధికారులు మొత్తం 36 గంటల పాటు కష్టపడి కొత్త పట్టాలు అమర్చారు.

మొత్తం 34 స్పాన్లతో కూడిన ఈ వంతెన హౌరా-చైన్నై ప్రధాన మార్గంలో గోదావరి నదిపై 1977లో దీన్ని నిర్మించారు. పైన వాహనాలు, కింద రైళ్లు నడిచే విధంగా నిర్మించిన ఈ వంతెనపై వాహనాల ఒత్తిడి పెరగడంతో రైళ్ల కోసం ప్రత్యేకంగా ఆర్చ్ వంతెనను నిర్మించారు. భారీ వాహనాల రాకపోకలను రోడ్డు కం రైలు వంతెన పై నిషేధించారు. వాహనాల రద్దీ కారణంగా వంతెన దెబ్బతీంది. కింద రైల్వే ట్రాక్ ను కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఏర్పడింది.

దేశ వ్యాప్తంగా కారోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించారు. దీనితో కింద రైళ్ళు, పైన వాహనాలు నిలిచిపోయాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న అధికారులు మరమ్మతులు చేశారు. కరోనా వైరసను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో కార్మికులను, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వంతెన ఆధునీకరణ పనులను పూర్తి చేసినట్లు విజయవాడ డివిజన్ డిఆర్ఎంపి శ్రీనివాస్ వెల్లడించారు. పనులను పర్యవేక్షించిన దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్ మాల్య ఆధునీకరణ పనుల్లో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బంది సేవలను ప్రశంసించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp