ఆ ఎమ్మెల్సీ స్థానాల‌పై ఇప్ప‌టి నుంచే పావులు!

By Kalyan.S Aug. 02, 2020, 07:00 pm IST
ఆ ఎమ్మెల్సీ స్థానాల‌పై ఇప్ప‌టి నుంచే పావులు!

రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది.., అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నాయి ఆయా పార్టీలు. ఆ రెండింటినీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో వాటిపై ఇప్పటి నుంచే గురి పెట్టాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీలో ఉన్నా.. ప్ర‌ధానంగా టీఆర్ఎస్, బీజేసీ మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉండ‌నుంది. ఇంత‌కీ ఆ స్థానాలు ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మ‌డి హైద‌రాబాద్ - రంగారెడ్డి - మ‌హ‌బూబ్ న‌గ‌ర్, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ - న‌ల్ల‌గొండ - ఖ‌మ్మం జిల్లాల‌కు సంబంధించిన రెండు శాస‌న మండ‌లి స్థానాల‌కు వ‌చ్చే ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఆశావ‌హులు త‌మ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. క‌రోనా కాలంలోనూ త‌మ గాడ్ ఫాద‌ర్ ల చుట్టూ తిరుగుతున్నారు. కొంద‌రు ఫొన్ల‌లో మంత‌నాలు జ‌రుపుతున్నారు.

అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కూ బోణీ కొట్ట‌ని టీఆర్ఎస్‌

ఉమ్మ‌డి హైద‌రాబాద్ - రంగారెడ్డి - మ‌హ‌బూబ్ న‌గ‌ర్ స్థానంలో టీఆర్ఎస్ ఇప్ప‌టి వ‌ర‌కూ బోణీ కొట్ట‌లేదు. గ‌త ఏడాది జ‌రిగిన రెండు ఉపాధ్యాయ, ఒక ప‌ట్ట‌భ‌ద్రుల స్థానంలో టీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప‌రాజ‌యం పొందారు. ప్ర‌స్తుతం అక్క‌డ బీజేపీ ఎమ్మెల్సీగా రామ‌చంద్ర‌రావు కొన‌సాగుతున్నారు. మార్చితో ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈసారి ఎలాగైనా ఆ స్థానంలో పాగా వేసేందుకు టీఆర్ఎస్ నాయ‌క‌త్వం పావులు క‌దుపుతోంది. ఆశావాహులు టికెట్ కోసం, ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు కోసం లాబీయింగ్ మొద‌లు పెట్టారు. మ‌రోవైపు ఆ స్థానాన్ని మ‌ళ్లీ నిల‌బెట్టుకునేందుకు బీజేపీ కూడా గ‌ట్టి ప్ర‌య‌త్నాలో ఉంది. ఇప్ప‌టికే రామ‌చంద్ర‌రావు ఆ ప‌నిలోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మూడు సార్లుగా టీఆర్ఎస్సే..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ - న‌ల్ల‌గొండ - ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గ‌త మూడు సార్లుగా తెలంగాణ రాష్ట్ర స‌మితి మ‌ద్ద‌తు ఇచ్చిన నేత‌లే నెగ్గుతూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం రైతు బంధు చైర్మ‌న్ ప‌ల్లా రాజ‌శ్వేర‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. నాలుగో సారీ కూడా ఆ స్థానం టీఆర్ఎస్ కే ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు ధీమాతో ఉన్నాయి. ద‌గ్గ‌ర చేసి రాజ‌కీయాలు ఎటు మార‌తాయో.. అభ్య‌ర్థుల ఎంపిక‌లో జ‌రిగే ప‌రిణామాల‌ను బ‌ట్టి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్, బీజేపీ రెండూ.. ఆ స్థానాల‌పై ఆశ‌లు పెట్టుకున్నాయి. విద్యావంతులు, ఉద్యోగుల‌ను ఆక‌ట్టుకునేందుకు అధికార పార్టీ, ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మ‌లుచుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టుకున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp