మాజీ పోలీస్ పటేల్ కు రాష్ట్ర స్థాయి పదవి

By Thati Ramesh Sep. 17, 2021, 07:30 pm IST
మాజీ పోలీస్ పటేల్ కు రాష్ట్ర స్థాయి పదవి

తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ని నియమిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన నిజమాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనపై నమ్మకంతో ఆర్టీసీ చైర్మన్ గా నియమించిన కేసీఆర్ కు బాజిరెడ్డి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. పోలీస్ పటేల్ గా పనిచేసిన బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ కాగా.. పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సజ్జనార్ ఆర్టీసీ ఎండీ గా ఉండటం విశేషం.

పంచెకట్టులోనే ఎక్కువగా కనిపించే బాజిరెడ్డి గోవర్ధన్ కు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మొదటిసారి కీలకమైన రాష్ట్రస్థాయి పదవి వరించింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిమన్ పల్లి గ్రామం బాజిరెడ్డి స్వస్థలం. ఏడేళ్లపాటు పోలీస్ పటేల్ గా పనిచేసిన బాజిరెడ్డి 1981లో సర్పంచ్ గా గెలిచి రాజకీయప్రస్థానం ప్రారంభించారు. 1986లో సిరికొండ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత పలు నామినేటడ్ పదవులు కూడా చేపట్టారు.

Also Read : అగరబత్తీలపైనా కోర్టుకా..? పిటీషనర్‌కు హైకోర్టు మొట్టికాయలు

1999లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా విజయం..

మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్, 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆర్మూర్ నుంచే పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తనకు టికెట్ రావడానికి వైఎస్సార్ నే కారణమని బాజిరెడ్డి చెబుతారు. రాజకీయాల్లో వైఎస్సార్ నే తన గాడ్ ఫాదర్ అని పలుసార్లు బహిరంగంగా ప్రకటించారు. తనకు మూడుసార్లు కాంగ్రెస్ టికెట్ రావడంలో వైఎస్సార్ పాత్ర కీలకమైనదన్నారు. 2004 నుంచి 2009 వరకు బాన్సువాడ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.

వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన బాజిరెడ్డి.. 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. అదే ఏడాది నిజమాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)పై గెలిచారు. తర్వాత 2018 లో కూడా అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి పై నెగ్గారు. ఎన్నికల తర్వాత డీఎస్, టీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. మక్లూర్, డిచ్ పల్లి, ధార్ పల్లి మండలాలు ఈ నియోజవర్గ పరిధిలోనివి. కేసీఆర్ కుమార్త కల్వకుంట్ల కవిత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిని ఓడించి లోక్ సభలో అడుగుపెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓటమి చెందారు.

Also Read : తెలంగాణ కార్పొరేషన్ పదవులు కీలక నేతలకు పదవులు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp