చంద్రబాబు అంతర్జాతీయ ఉగ్రవాది

By iDream Post Apr. 06, 2020, 04:12 pm IST
చంద్రబాబు అంతర్జాతీయ ఉగ్రవాది

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అంతర్జాతీయ ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. అంతర్జాతీయ ఉగ్రవాదికి చంద్రబాబుకు మధ్య తేడా ఏమీ లేదన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడని పేర్ని నాని చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులను ప్రభుత్వం దాచిపెడుతోందని, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి జూమ్‌ టెక్నాలజీతో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ పేర్ని నాని.. చంద్రబాబును ఉగ్రవాదితో పోల్చారు. ‘‘ఉగ్రవాదులు పక్కదేశాల్లో ఉంటారు. ఇక్కడ పరిస్థితి ఏమిటో వారికి తెలియదు. అక్కడ నుంచే ఇక్కడ బాంబులు పెడుతుంటారు. ఇలాగే చంద్రబాబు కూడా హైదరాబాద్‌లో కోట భంగళాలో కూర్చుకుని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు.’’ అంటూ మండిపడ్డారు.

చంద్రబాబు చెప్పేంతలా కరోనా వైరస్‌ రాష్ట్రంలో ప్రభలుతుంటే.. వారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా ఎవరికి సోకిందో చెప్పాలని నాని ప్రశ్నించారు. టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధుల్లో ఎవరికి వైరస్‌ సోకిందో చెబితే చికిత్స అందిస్తామని చెప్పారు. ఏ ఊరులో వైరస్‌ సోకిందో కూడా తెలపాలని నాని డిమాండ్‌ చేశారు. విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని నాని ధ్వజమెత్తారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp