‘జగన్‌ బలమైన నాయకుడు కాబట్టే పిలవలేదు’

By Karthik P Feb. 26, 2020, 04:18 pm IST
‘జగన్‌ బలమైన నాయకుడు కాబట్టే పిలవలేదు’

జగన్‌పై కేసులు ఉండబట్టే ట్రంప్‌తో విందుకు కేంద్రం పిలవలేదని విమర్శలు చేసిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి బొత్స సత్యానారాయణ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. జగన్ బలమైన నాయకుడు కాబట్టే పిలవకపోయి ఉండొచ్చన్నారు. ఈ రోజు మీడియా.. నిన్న కుప్పంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. పై విధంగా బొత్స స్పందించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జిని ఎందుకు పిలవలేదని బొత్స ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కేంద్రంలో ఉన్న బీజేపీకి కొన్ని ప్రణాళికలు, ఆలోచనలు ఉంటాయని, అందులో భాగంగానే ఆహ్వానాలు పంపిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో బలమైన పార్టీలు, ప్రభుత్వాల నేతలను ఆహ్వానించకూడదనే ఆలోచన వారు చేసుండవచ్చన్నారు. దానికి చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు తాను మాత్రమే తెలివైనవాడనని.. మిగతావారంతా అమాయకులనట్లుగా మాట్లాడుతుంటారని బొత్స ఎద్దేవా చేశారు. కడుపు మంటతోనే చంద్రబాబు జగన్‌పై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా గమనిస్తున్నారని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp