మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన?

By Siva Racharla 12-11-2019 03:16 PM
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన?

మహారాష్ట్రలో ఉత్కంఠతకు తెరపడడింది. అధికారానికి సరిపడిన సీట్లు బీజేపీ-శివసేన కూటమి సాధించినా ముఖ్యమంత్రి పదవి మీద ఒక అంగీకారానికి రాలేకపోయాయి. బీజేపీ 105, శివసేన 56, NCP 54, కాంగ్రెస్ 44, ఇతరులు 17 సీట్లు సాధించాయి. మొదట బీజేపీ,తరువాత శివసేన తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గవర్నర్ కు తెలియచేశాయి.గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు NCP ని ఆహ్వానించి ఈ రాత్రి  8:30 వరకు గడువు ఇచ్చారుఈ మధ్యాహ్నం  ఒంటిగంట సమయంలో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సుచేశారని ప్రసారభారతి ట్వీట్ చేసి కొంత సమయం తరువాత దాన్ని డిలీట్ చేసింది.ఈ మధ్యాన్నం సమావేశమైన కేంద్రమంత్రిమండలి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిందని ఇప్పుడు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితిలో మొదట శాసనసభను suspensionలో ఉంచి  కొంత కాలం రాష్ట్రపతి పాలన పెడుతుంది. కొన్ని నెలల తరువాత ఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోతే శాసనసభను రద్దుచేసి మరోసారి ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇప్పుడు కేంద్రప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నది స్పష్టంగా చెప్పలేదు. మరికొంత సమయంలో స్పష్టత రావొచ్చు. 

idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News