మహారాష్ట్రలో కూటమి నిలుస్తుందా.? కూలుతుందా .?

By Amar S 22-11-2019 06:37 PM
మహారాష్ట్రలో కూటమి నిలుస్తుందా.? కూలుతుందా .?

కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు దేశమంతటా ఉత్కంఠను రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గా ఏర్పడి పోటీ చేసిన బీజేపి-శివసేన పార్టీలు, ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో భేదాలు వచ్చి విడిపోయాయి. కేవలం ముఖ్యమంత్రి సీటు తమకే కావాలని శివసేన, బీజేపి తో 3 దశాబ్దాల మైత్రిని దూరం చేసుకుంది.. కేంద్రమంత్రి వర్గం నుండి శివసేన ఎంపీ లు బయటకు వచ్చారు.. ఇక మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సింది బిజేపి కి ఛాన్స్ లేదు.. అలా ఏర్పాటు చేయాలంటే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపి తో అయిన, బద్ద శత్రువు అయిన కాంగ్రెస్ తో అయిన కలవాలి. అది అస్సలు జరగదు. మద్యలో శరద్ పవార్, ప్రధాని మోదీతో చర్చలు జరిపిన అవి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినవి కాదని ఎన్సీపి వర్గాలు తెలిపాయి.మరోపక్క ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరు ముందుకు రాకపోవడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు కూడా సిఫారసు చేశారు. కానీ శివసేన,కాంగ్రెస్,ఎన్సీపిలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటు ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. మూడు పార్టీల కూటమి అడుగులు ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకుముందుకు పడటం లేదు.

శివసేన,కాంగ్రెస్,ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయం ఈ రోజు తేలే అవకాశం ఉంది.. శివసేన, కాంగ్రెస్,ఎన్సీపి నాయకులు చర్చలు జరుపూతూనే ఉన్నారు. ఇంకా మంత్రి వర్గ సీట్లు సర్దుబాటు కాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. శివసేన, ఎన్సీపి లు ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని,5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకే ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ఱయం తీసుకున్నట్టు సమాచారం.. కానీ కీలక మంత్రిత్వ శాఖల పై ఇంకా మూడు పార్టీలు పట్టుబట్టి కూర్చోవడంతో సీట్ల సర్దుబాటు ఎటు తెగటం లేదు. మరోపక్క ఠాక్రే వారసులే మహారాస్ట పీఠాన్ని ఎక్కాలని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే ఉవ్విళ్లూరుతోంది. తన కొడుకు ఆదిత్య ను సీఎం చేయాలని పట్టు పడుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం చిన్న వాడైన ఆదిత్య కంటే అనుభవజ్ఞుడైన ఉద్దవ్ వైపే మొగ్గు చూపుతోంది. ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి కాంగ్రెస్ ,ఎన్సీపీలు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. కానీ కూటమిలో కాంగ్రెస్ కొనసాగాలంటే శివసేన హిందూత్వ ఎజెండాని పక్కకు పెట్టాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్పష్టం చేసినట్టు వినికిడి. ఒకవేళ భవిష్యత్ లో హిందుత్వ ఎజెండా తీసుకస్తే ప్రభుత్వం నుండి వైదోలుగుతామని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

హిందుత్వ ఎజెండాతోనే రాజకీయాల్లోకి వచ్చిన శివసేన కడవరకు ఆ పంథాకు దూరంగా ఉంటుందా. దశాబ్దాలుగా కాంగ్రెస్ కు శత్రువుగా ఉన్న శివసేన కూటమిలో ఇమడగలుగుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి. కొంతమంది శివసేన ఎమ్మేల్యేలు ఇప్టటికే కాంగ్రెస్ తో కలసి పనిచేయడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు.ఒకవేళ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహారాష్ట్రలో మెజార్టీ స్థానాలు గెలిచిన బీజేపి పార్టీ చూస్తు ఊరుకుంటుందా అంటే ఇప్పుడే చెప్పలేము. కర్నాటకలో జరిగిన మాదిరిగానే మహారాష్ట్రలో కూడా మధ్యలోనే కూటమి ప్రభుత్వం కూలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో లేదో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News