రజనీకీ తొందరెక్కువే..!

By Voleti Divakar Oct. 18, 2020, 02:20 pm IST
రజనీకీ తొందరెక్కువే..!

'నేనొక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు ' అని కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా మారిన రజనీకాంత్ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది. ఆయన చిత్రాల్లోని డైలాగులు జనజీవానికి దగ్గరగా, సందేశాత్మకంగా ఉంటాయి. రజనీకాంత్ కూడా నిజజీవితంలో ఎంతో ప్రశాంత చిత్తంతో , ఆధ్యాత్మికంగా కనిపిస్తారు. ధ్యానం చేసేందుకు తరుచూ ఒంటరిగా హిమాలయాలకు కూడా వెళుతుంటారు.

అయితే ఈ మధ్య ఆయన వైఖరిలో తొందరపాటు కనిపిస్తోందా?. చెన్నై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అసలేమి జరిగిందంటే...చెన్నైలో ఆయనకు రాఘవేంద్ర కల్యాణమండపం ఉంది. చెన్నై నగరపాలక సంస్థ కల్యాణమండపానికి రూ. 6.50లక్షల ఆస్తిపన్నుచెల్లించాలని నోటీసు జారీ చేసింది.

ఐతే కరోనా నేపథ్యంలో ఆస్తిపన్నులో 50శాతం రాయితీ నిబంధననను తనకు వర్తింపజేయాలని ఆయన నగరపాలక సంస్థ అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు. తన విజ్ఞప్తి పై అధికారులు ఏవిధంగానూ స్పందించకుండానే వారం రోజుల వ్యవధిలోనే తన విజ్ఞప్తి పై సత్వరం స్పందించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఆశ్రయించడం ఆయన ను ఇబ్బందుల పాలు చేసింది.

రజనీ తొందరపాటు పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రజనీ విజ్ఞప్తి లేఖ పై అధికారులు స్పందించే సమయం కూడా ఇవ్వకుండా కోర్టు మెట్లు ఎక్కడాన్ని తప్పుపట్టింది. దీంతో రజనీ మాటలకు చేతలకు ఇంత తేడానా అన్న చర్చ జరుగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp