కరోనా పేషెంట్లకు ప్లాస్మా ఇస్తా - మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

By Kiran.G Aug. 10, 2020, 01:50 pm IST
కరోనా పేషెంట్లకు ప్లాస్మా  ఇస్తా - మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

కరోనా పేషెంట్ల చికిత్స కోసం తన ప్లాస్మా ఇస్తానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆయన కరోనా బారి నుండి ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే.. కరోనా నుండి కోలుకున్న తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాల్లోకి వెళితే గత నెల 25 న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. దాంతో ఆయన హాస్పిటల్లో చేరారు. 11 రోజుల చికిత్స అనంతరం ఆయన కరోనా బారినుండి కోలుకున్నారు. ఈ నెల 5 న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ కరోనా చికిత్స అనంతరం తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని వెల్లడించారు.

తన శరీరంలో కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెంది ఉంటాయని కాబట్టి త్వరలో కరోనా రోగులకు ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన అనంతరం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చౌహాన్ సమీక్ష నిర్వహించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం 868 మందికి కరోనా సోకింది. దాంతో రాష్ట్రంలో మొత్తం 39,025 కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా 996 మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్ లో 29020 మంది కరోనా బారి నుండి కోలుకోగా 9009 ఆక్టీవ్ కేసులు ఉన్నాయి..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp