మాచర్ల మాజీ ఎమ్మెల్యే మృతి

By Siva Racharla Sep. 24, 2021, 09:45 am IST
మాచర్ల మాజీ ఎమ్మెల్యే మృతి

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మా రెడ్డి నిన్న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన... నిన్న చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు, అలాగే అధికార వైసీపీ నాయకులు సంతాపం ప్రకటించారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలో పార్టీలకు అతీతంగా ఆయనకు నివాళులు అర్పించారు.

పిన్నెల్లి రామిరెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సుందరరామిరెడ్డి అన్నదమ్ములు. పిన్నెల్లి లక్ష్మారెడ్డి మాచర్ల నియోజకవర్గం లో దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపించారు. పిన్నెెల్లి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌గా పని చేశారు. నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత... వరుసగా మూడు సార్లు ఆ పార్టీ విజయం సాధించినా సరే పిన్నెల్లి కుటుంబం మాత్రం నియోజకవర్గంలో టీడీపీకి గట్టిపోటీ ఇచ్చింది . తొలిసారి పిన్నెల్లి కుటుంబం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి పెద్దనాన్న, పిన్నెల్లి నలుగురు సోదరుల్లో చిన్నవాడైన సుందరరామిరెడ్డికి అవకాశం వచ్చింది.1 994 ఎన్నికల్లోమాజీ ఎమ్మెల్యే చల్లా నారప రెడ్డి మద్దతుతో ,కాసు బ్రహ్మానందరెడ్డి, సహకారంతో టికెట్ తెచ్చుకోగా... ఆ ఎన్నికల్లో ఆయన పదివేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 

Also Read: అలా చేస్తే ఇరకాటంలో ప‌డేది టీడీపీనే..!

అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే సుందర రామిరెడ్డిని మావోయిస్టు లు కాల్చి చంపారు.అయితే అది మావోయిస్టు లు చేసిన హత్య కాదని, టీడీపీ నాయకుల ప్రోత్సాహం తో జరిగిందని పిన్నెల్లి కుటుంబం ఆరోపించింది . 1999 ఎన్నికల్లో పిన్నెల్లి కుటుంబానికి సీటు వచ్చింది. సుందర రామిరెడ్డి సోదరుడు... పిన్నెల్లి లక్ష్మారెడ్డి తొలిసారి ఆ ఎన్నికల బరిలో నిలిచారు. ఇక టీడీపీ అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే గా ఎన్నికైన జూలకంటి నాగిరెడ్డి సతీమణి జూలకంటి దుర్గాంబకు సీటు ఇచ్చింది.

ఆ ఎన్నికల్లో పిన్నెల్లి కుటుంబం కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. అయినా సరే ఎక్కడా కూడా వెనక్కు తగ్గని పిన్నెల్లి కుటుంబం, వైఎస్ మద్దతుతో నియోజకవర్గంలో గట్టిగా పోరాటం చేసింది. ఇక 2004 ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి మరోసారి పిన్నెల్లి లక్ష్మారెడ్డి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ పాదయాత్రకు ఉన్న ప్రభావాన్ని సమర్ధవంతంగా నియోజకవర్గంలో వాడుకున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను టీడీపీ ప్రోత్సహించడంతో... ప్రజలు కూడా పిన్నెల్లి కుటుంబానికి అండగా నిలిచారు.
దీనితో ఆ ఎన్నికల్లో దాదాపుగా 20 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత వైఎస్ హయాంలో నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు తెచ్చే ప్రయత్నం చేసారు.

Also Read: జలగం వెంగళరావు కుటుంబం రాజకీయంగా ఏమి చేస్తుంది ?

వాస్తవంగా 2004 ఎన్నికల్లో మాచర్ల టికెట్ ను మొదట కాసు కృష్ణారెడ్డికి ప్రకటించారు.టీడీపీ పది సంవత్సరాల పాలనలో తీవ్రమైన అణిచివేతకు గురైన పిన్నెల్లి కుటుంబానికి గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి వారికే టికెట్ ఇవ్వమని కాసు కృష్ణారెడ్డి మరియు స్థానిక కాంగ్రెస్ నేతలు వైయస్సార్ ను కోరటంతో కాసు కృష్ణారెడ్డికి నరసరావుపేట టికెట్ ఇచ్చి లక్ష్మారెడ్డికి మాచర్ల టికెట్ ఇచ్చారు.

1999లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన జూలకంటి దుర్గాంబ కొడుకు, ఒకే సారి జరిగిన ఏడుగురి హత్యకేసులో నిందితుడైన బ్రహ్మరెడ్డి చంద్రబాబు 2004 ఎన్నికల టికెట్ ఇచ్చాడు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో మాచెర్ల ఎన్నిక జరిగింది. టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి మీద ఉన్న వ్యతిరేకత,పిన్నెల్లి మీద ఉన్న సానుభూతి ,వైఎస్సార్ హవా మొత్తంగా తొలిసారి పిన్నెల్లి కుటుంబం ఎన్నికల్లో గెలిచింది.

Also Read: పంజాబ్ కాంగ్రెస్ లో చీలిక అనివార్యమా ?

అయితే 2009లో లక్ష్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి పోటీ పడటంతో వారిద్దరిని కాదని యువకుడు, లక్ష్మారెడ్డి కజిన్ వెంకటేశ్వర్ రెడ్డి కొడుకు అయినా జడ్పీటీసీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి వైఎస్ సీటు ఇచ్చారు. యువకుడు కావడం, దూకుడు రాజ్జకీయంతో రామకృష్ణారెడ్డికి సీటు ఇవ్వగా ఆ ఎన్నికల్లో 13 వేల ఓట్ల మెజారిటీ తో ఆయన గెలుపొందారు. ఇక ఆ తర్వాత వైఎస్ మరణం, మారిన పరిణామాలతో వైఎస్ జగన్ కు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మద్దతు ఇచ్చారు.

కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన, వైసీపీ తరుపున 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో లక్ష్మారెడ్డి... కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా ఆయన 20 వేల ఓట్లు సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని భావించినా సరే చంద్రబాబు సీటు ఇవ్వకపోవడంతో టీడీపీకి మద్దతు ఇచ్చారు . ఆ తర్వాత ఆయన పెద్దగా రాజకీయాల్లో కనపడలేదు. 

2019 ఎన్నికల్లో కూడా టీడీపీకి మద్దతు ఇచ్చినా మరోసారి వైసీపీ తరుపున రామకృష్ణారెడ్డి గెల్చాడు. లక్ష్మారెడ్డి, కొడుకు వరసయ్యే రామకృష్ణా రెడ్డి ఓటమే ధ్యేయంగా రాజకీయాలు చేయకుండా వైసీపీలో ఉంటే రాజకీయంగా ఎదో ఒక పదవి రావటానికి అవకాశం ఉండేది. రెండు దశాబ్దాలు టీడీపీతో పోరాడి చివరి దశలో టీడీపీతోనే ప్రయాణం చేయటం లక్ష్మారెడ్డి  వర్గం దిగమింగుకోలేని విషయం..

Also Read:తెలుగోడి రాజసం..మన కొండపల్లి కోట..

లక్ష్మారెడ్డి శ్రీమతి అన్నపూర్ణమ్మ పేరుతొ చాలా కాలంగా హోటల్ నడుపుతున్నారు. ఆవిడ నిజంగానే అన్నపూర్ణ అని ,డబ్బులు ఉన్నా లేకున్నా ఆకలితో ఉన్నవారికి తిండి పెడతారన్న మంచి పేరు ఉంది.లక్ష్మా రెడ్డి మరణంతో పార్టీలకు అతీతంగా మాచర్ల ప్రజలు సంతాపం ప్రకటిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp