బాగున్నారా అంకుల్ : వాళ్లకు చినబాబు ఫోన్లు...?

By Venkat G Sep. 14, 2021, 08:15 am IST
బాగున్నారా అంకుల్ : వాళ్లకు చినబాబు ఫోన్లు...?

ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకులు బలం అనేది ఇప్పుడు అత్యవసరం. చాలావరకు కీలక నాయకత్వం సైలెంట్ గా ఉండడంతో చంద్రబాబు నాయుడు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించిన అవి పెద్దగా విజయవంతం కావడం లేదు అనే భావన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తోంది. యువ నాయకుల విషయంలో నారా లోకేష్ చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సరే రాయలసీమ ప్రాంతంలో అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలామంది బయటకు రావడం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం అని కాదుగానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకునేందుకు మాత్రం పార్టీ అధిష్టానం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది.

చంద్రబాబు నాయుడు పట్టుదలతో ముందుకు వెళుతున్న సరే కొన్ని కొన్ని అంశాల్లో పార్టీ నాయకత్వం ఆయన వెనక్కు లాగుతుంది అనే భావన కార్యకర్తలను వేధిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొంతమందికి ఫోన్లు చేస్తున్నారు అని మీడియా వర్గాలు అంటున్నాయి. అసలు ఎవరికి ఫోన్ చేస్తున్నారు...? ఎందుకు ఫోన్ చేస్తున్నారు...? చేసి ఏం మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇటీవల బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కి నారా లోకేష్ నుంచి ఫోన్ వెళ్లిందట.

లోకేష్ క్యాబినెట్ లో ఉన్న సమయంలో కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. అయితే బీజేపీతో విభేదాల కారణంగా మంత్రివర్గం నుంచి కామినేని శ్రీనివాస్ బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు కామినేని శ్రీనివాస్ ని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారట లోకేష్. కృష్ణాజిల్లాలో మీరు బలమైన నాయకుడిగా ఉన్నారని, పార్టీలోకి వస్తే కచ్చితంగా మీకు ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా ప్రభుత్వంలో చోటు కల్పిస్తామని మళ్లీ మీకు వైద్య ఆరోగ్యశాఖ అప్పగిస్తామని కామినేని శ్రీనివాస్ కి లోకేష్ చెప్పేశారట.

కైకలూరు నియోజకవర్గం లో మీకు మళ్ళీ సీటు ఖరారు చేయడమే కాకుండా ఏదైనా పరిస్థితిలో ఓడిపోతే మిమ్మల్ని శాసన మండలి ద్వారా ప్రభుత్వం లోకి తీసుకుంటామని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని లోకేష్ కామినేని శ్రీనివాస్ కు భరోసా ఇచ్చారట. అలాగే బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఫోన్ చేసి బాగున్నారా అని అడుగుతూ... టీడీపీలోకి వస్తే విశాఖ ఉత్తరం నుంచి సీట్ ఖరారు చేస్తామని స్పష్టత ఇచ్చినట్టుగా తెలిసింది. మీకు పార్టీలో ప్రాధాన్యత విషయంలో ఎటువంటి సమస్య అవసరం లేదని విశాఖ జిల్లా నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదని లోకేష్ స్పష్టంగా చెప్పారట.

ఆయనతో పాటుగా కడప జిల్లాకు చెందిన తులసి రెడ్డి కి కూడా నారా లోకేష్ ఫోన్ చేసినట్లుగా సమాచారం. అమరావతి ఉద్యమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న తులసిరెడ్డి టిడిపిలోకి తీసుకుంటే మంచి వాయిస్ ఉంటుంది అనే భావన లోకేష్ ఉన్నారట.

ఆయనతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు కూడా లోకేష్ నుంచి ఫోన్ వెళ్ళింది అని టాక్. తమకు మద్దతు ఇవ్వాలనీ... వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారట చిన్న బాబు.

ప్రస్తుతం కీలక నాయకత్వం ఇబ్బందులు పెట్టడంతో ఇతర పార్టీలో ఉండి బలంగా తమ గొంతు వినిపిస్తున్న వారికి లోకేష్ పార్టీలోకి ఆహ్వానం పలకడం మంచి పరిణామంగా టిడిపి భావిస్తోంది. అయితే వీరు ఎవరు కూడా గతంలో అనుకున్న విధంగా ప్రభావం చూపించలేని నాయకులే. మరి జగన్ ను ఎదుర్కోవడంలో వీరు ఎంతవరకు సహకరిస్తారు అనేది లోకేష్ అర్థం చేసుకోవాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp