ఎక్కడైనా బావేగానీ..!

By Jaswanth.T Jul. 09, 2020, 07:42 pm IST
ఎక్కడైనా బావేగానీ..!

‘‘ఎక్కడైనా బావేగానీ, వంగతోట కాదు’’ అని వెనకటికొక సామెత ఉంటుంది. వంగతోట కాడ బావా అంటే వంకాయలు ఇవ్వాల్సి వస్తుందన్నది ఇందులో నర్భగర్భమైన అర్ధమనుకోండి.

ఎయిర్‌పోర్టులో కలిసారు.. కంపెనీ ప్రతినిధులతో నవ్వుతూ మాట్లాడారు.. ఇక వాళ్ళను తప్పించేస్తారు.. ఇచ్చిన కోటి రూపాయల నష్టపరిహారం కంపెనీదే.. ఇలా ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన వెంటనే పచ్చబ్యాచ్‌ మొదలెట్టి ఊకదంపుడు ప్రచారం. ఊకను దంచితే ఏమొస్తుంది గొంతులు గొట్రుతప్ప. అదే ధాన్యాన్ని దంచితే కనీసం బియ్యమైనా వస్తాయి. కనీసం ఈ మాత్రం ఇంగిత జ్ఞానం తెలుగు రాష్ట్రాల్లోని పచ్చబ్యాచ్‌కు ఎప్పుడో కరువైపోయింది. దీంతో వాళ్ళమానాన వాళ్ళు ఊకనే దంచుకుని, గొట్రు తెచ్చుకున్నారు.

నీరబ్‌కుమార్‌ నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ విచారణ పూర్తిచేసి ఎల్టీపాలిమర్స్‌ యాజమాన్యానిదే తప్పని నివేదిక సిద్ధం చేసింది. దీంతో ఎల్జీపాలిమర్స్‌ కంపెనీకి చెందిన ఎండీ–సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా మొత్తం 12 మంది అరెస్టయ్యారు. దీంతో పచ్చబ్యాచ్‌కు పచ్చివెలక్కాయ గొంతులో పడింది. అసలే ఊకదంపుడు గొట్రుతో సతమతమవుతుంటే ఇప్పుడీ వెలక్కాయొకటి. ఇప్పుడేం చెయ్యాలో తెలియక మిన్నుకుండిపోవాల్సి వచ్చింది. మొదట్లో చెప్పుకున్నట్లు వందమాగద మీడియా దీనిగురించి ఏ మాత్రం ‘వివరణాత్మక’ విశ్లేషణలు చేయకపోవడం ఇక్కడ కొసమెరు.

సాధారణంగా ప్రతిపక్ష మంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని గురించి మాట్లాడితే ప్రజలు వారితో మమేకమవుతారు. అంతే కాని తామేమనుకుంటామో దాన్ని మాత్రమే మాట్లాడుతూ ఉంటే ‘ఇది మన విషయం కాదులే’ అని ప్రజలు పట్టించుకోవడం మానేస్తారు. కనీసం ఈ పాటి జ్ఞానం కూడా కొరవడడంతో అయిందానికీ, కానిదానికీ మైకుల ముందుకొచ్చి నోరు పారేసుకుంటే ఆ తరువాత మాట్లాడ్డానికేమీ మిగలదు. ఇప్పుడు ఎల్టీ పాలిమర్స్‌ విషయం లాగ.

ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల అదృష్టం గురించి తప్పక ప్రస్తావించుకోవాలి. నిర్లక్ష్యంతో తప్పు చేసారు. చట్టం ముందు చిక్కారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కానీ ఘనత వహించిన మన పచ్చబ్యాచ్‌కి సదరు డైరెక్టర్ల కులాల మీద పెద్దగా అవగాహన లేనట్టుంది. లేకపోతే అదిగో బీసీలను అరెస్టు చేసారు, ఎస్సీలను అవమానించేసారు, ఎస్టీలను ఇంకేదో చేసారు... అంటూ మళ్ళీ మైకుల మందుకొచ్చేసేవారు. ఉభయ రాష్ట్రాల ప్రజలకు డైరెక్టర్ల అరెస్టు విషయంలో ఈ బాధ తప్పిందనే చెప్పాలి.

పనిచేసేవారు, పని చేసేసామని చెప్పుకునేవారి గురించి ప్రస్తావించుకోవడం సందర్భానుసారంగా ఉంటుంది. అంతా నేనే చేసాను అంటూ గ్రాఫిక్స్‌తో సరిపెట్టేయడం పాలన కాదు. నవ్వుతూ మాట్లాడినాగానీ (ఏం చేస్తాం సీయం జగన్‌ది నవ్వు ముఖమాయె), తన ప్రజలకు ఏదైనా కష్టం ఎదురైతే దానికి కారణమైన వారికి తగిన పనిష్మెంట్‌ను చట్ట ప్రకారం ఇచ్చేందుకు ఎటువంటి వెనకడుగు వేసేదిలేదని సీయం జగన్‌ మరోసారి స్పష్టం చేసారు. ఎల్జీ పాలిమర్స్‌ మృతులకు ఒకొక్కరికి కోటి రూపాయల ప్రకటించడంతో పాటు, అక్కడ ఆ గ్యాస్‌ కారణంగా ప్రభావితమైన ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సదుపాయం అందించేందుకు కూడా ఏర్పాట్లు చేసారు. నిర్లక్ష్యానికి బాధ్యులను చట్టంముందు నిలిపారు.. ఇదీ పాలన అంటే. ప్రజలకు మేలు చేయాలన్న భావన అనుభవంతో రాదు. మనస్సులో ఉంటే వస్తుంది. అందుకు ఇంత కన్నా రుజువు అవసరం లేదు..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp