గ‌ణేశ్ కు జై.. ఇలా చేయ‌డ‌మే మంచిదోయ్‌..!

By Kalyan.S Sep. 10, 2021, 07:39 am IST
గ‌ణేశ్ కు జై.. ఇలా చేయ‌డ‌మే మంచిదోయ్‌..!

ప్ర‌తీదీ రాజ‌కీయం చేయ‌డం రాజ‌కీయ పార్టీల‌కు మామూలే. ఇందులో ఎవ‌రి స్వార్థం వారిది. ఏ వ్యాఖ్య‌ల వెనుక ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయో తెలుసుకోక‌పోతే.. అంతిమంగా మోస‌పోయేది ప్ర‌జ‌లే. న‌ష్ట‌పోయేది కూడా ప్ర‌జ‌లే. ఏపీలో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌పై జ‌రుగుతున్న జ‌గ‌డాన్నే ప‌రిశీలిస్తే.. ఉత్స‌వాల‌ను వ‌ద్దు అని ప్ర‌భుత్వం అన‌లేదు. బ‌హిరంగంగా గూమిగూడి చేసుకోవ‌డం మంచిది కాద‌నే చెప్పింది. క‌రోనా జాడ‌లు ఇంకా పోలేద‌ని, మ‌హ‌మ్మారి పొంచి ఉంద‌నే విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్ద‌ని చెప్పింది. మ‌రి ఇందులో ఏం త‌ప్పు అనిపించిందో ఏమో కానీ.. తొలుత బీజేపీ, త‌ర్వాత టీడీపీ అనంత‌రం జ‌న‌సేన మూడు పార్టీలూ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్ల‌డం మొద‌లుపెట్టాయి.

విచిత్రం ఏంటంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం ఆదేశాల ప్ర‌కార‌మే.. ఏపీ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధిస్తే.. రాష్ట్రంలో అదే బీజేపీ దానిపై రాద్దాంతం చేస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టాల‌నే ఉత్సాహంతో అవి కేంద్ర ఆదేశాల‌న్న విష‌యం మ‌ర‌చిపోతోంది. బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వినాయక ఉత్సవాలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేమని స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు సరికాదని ధార్మిక పరిషత్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణలో కోర్టు వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా నిన్న ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు గణేష్ బహిరంగ ఉత్సవాలపై కోవిడ్ నిబంధనల పేరిట ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.. అయితే నిన్న హైకోర్టులో కొందరు దీనిపై పిటీషన్లు వేశారు. ఏపీలోని ప్రైవేటు స్థలాల్లో బయట వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాల దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ పై హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు అధికారం ఉంటుందని.. నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కోవిడ్ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు హైకోర్టు సూచించింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించింది. మరోవైపు పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో కేవలం విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాల్చింది.

వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌పై మ‌రి ఇప్ప‌టికైనా ఆ పార్టీల తీరు మార‌క‌పోతే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు కానీ.. ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షం తీరు ఎలాగున్నా.. క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా పొంచి ఉండ‌డం మాత్రం వాస్త‌వం. అందువ‌ల్ల పండ‌గ సంతోషంగా జ‌రుపుకోవాలంటే కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌డ‌మే మంచిద‌న్న విష‌యం మ‌రిచిపోవ‌ద్దు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp