పద్మారావుకు కరోనాపై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Kalyan.S Jul. 09, 2020, 07:38 am IST
పద్మారావుకు కరోనాపై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ ఉప స‌భాప‌తి ప‌ద్మారావు గౌడ్ కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. దీనిపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్​ ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంచార వైద్యశాల వాహనాన్ని ప్రారంభిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే.. గ‌తంలో హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ప్పుడు.. ఉప సభాపతి పద్మారావు అన్న‌కు తాను మాస్క్‌ ఇచ్చానని చెప్పారు. కానీ పద్మారావు మాస్క్‌ ధరించకుండా జేబులో పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏం కాదు హైదరాబాద్ వాళ్లం గట్టిగా ఉంటామని చెప్పుకొచ్చారన్నారు. చివర‌కు ఆయ‌నే క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డార‌ని చెప్పారు.

జాగ్రత్త పాటించడం మన కోసమే కాదు.. మన కుటుంబ సభ్యులకు రక్షణ కోసం అన్నారు. కరోనా నుంచి రక్షణ పొందే విషయంలో ఎవరికి వారు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్​ నుంచి రక్షణ పొందే విషయంలో ఎవరికి వారు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కరోనా నుంచి రక్షణ కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరు వైద్యుల్లా సలహాలిచ్చేస్తున్నారని ఛలోక్తి విసిరారు. క‌రోనాకు ఎవ‌రూ అతీతులు కార‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైర‌స్ విస్త‌రిస్తున్న వేళ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు బాగా వైర‌ల్ అయ్యాయి. ముఖ్యంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

ఇప్ప‌టికే అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో క‌రోనాకు ఎవ‌రూ అతీతులు కార‌ని కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌ధానంగా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి చేసిన‌ట్లే అని చాలా మంది భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp