కేరళలో యథాప్రకారం ‘స్థానిక’ ఎన్నికలు

By Kiran.G Aug. 05, 2020, 04:26 pm IST
కేరళలో యథాప్రకారం ‘స్థానిక’ ఎన్నికలు

దేశమంతా కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ కేరళ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌/నవంబర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపనుంది. ఈ మేరకు కేరళ రాష్ట్ర ఎన్నికల్‌ కమిషన్‌ వి.భాస్కరన్‌ స్పష్టం చేశారు.

కాగా, దేశంలో కొవిడ్‌ వైరస్‌ తాకిడి ప్రారంభమయ్యాక జరగనున్న తొలి ‘బ్యాలెట్‌’ ఎన్నికలివి. కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్నందున కొన్ని ప్రత్యేక నిబంధనలు అనుసరించి ఈ ఎన్నికలను జరపనున్నట్లు భాస్కరన్‌ చెప్పారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందన్నారు. అయితే, ఎన్నికల ప్రచారంపై మాత్రం కొన్ని కఠిన ఆంక్షలు అమలుచేయనున్నారు. బహిరంగ సభలకు బదులు మీడియా, సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోవాలని నిబంధన విధించింది. అలాగే ఇద్దరు, ముగ్గురుతో కూడిన బృందాలు మాత్రమే ఇంటింటికీ వెళ్లి ఓట్ల ప్రచారం చేసుకోవాలని చెప్పింది. పోలింగ్‌ బూత్‌ల వద్ద సైతం భౌతిక దూరం అమలు చేసేలా, శానిటైజర్లు, క్రిమిసంహారక స్ప్రేలు తగినన్ని అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది.

కాగా, కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని గత మార్చిలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ఆయన తొలగింపు.. కోర్టు, గవర్నర్‌ జోక్యంతో ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ పునర్నియామకం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో తిరిగి స్థానిక ఎన్నికలు జరిగే అవకాశముందా? లేదా? అంటూ ప్రసార మాధ్యమాల్లో, ప్రజల్లో చర్చలు సాగుతున్నాయి. ఇదే తరుణంలో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలకు అక్కడి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడం ఆసక్తి కలిగిస్తోంది. దీన్ని ఏపీ ప్రభుత్వంతోపాటు, ఎన్నికల సంఘం అధికారులూ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp