కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన.

By Surya.K.R 02-12-2019 09:23 AM
కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన.

రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోంది. కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం నుండి ఎలాంటి సానుకులతా రాకపోయినా రాష్ట్రమే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా సుమారు 20వేల మంది నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు, 50వేల మందికి పరోక్షంగా ఉపాది కల్పనకు ప్రణాళికలు రూపొందించింది. దీంతో రాయలసీమ అభివృద్దిలో మరొక ముందడుగు పడిందనే చెప్పాలి.

ఎన్నో అవాంతరాలు దాటుకుని పునర్విభజన చట్టంలోకి చేరిన కడప ఉక్కు పరిశ్రమ నాణ్యమైన ముడి ఖనిజం లేదనే "సెయిల్" నివేదికతో మరొకసారి మూలన పడింది. చివరి వరకూ మౌనంగా ఉండిపోయిన గత ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అనేసరికి సి.యం రమేష్ తో దీక్షలు, శంకుస్థాపనలు అంటూ హడావిడి చేసి చేతులు దులుపుకుంది, అప్పటి ప్రతిపక్ష నేత హొదాలో ఉన్న జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటాను అని హామీ ఇచ్చారు, అందులో భాగంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే వై.యస్.ఆర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ సభలో ఈ ఏడాది డిసెంబర్ లో కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్తాపన చేసి 3ఏళ్లలో నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పుకొచ్చారు, ఇప్పుడు తాజాగా హామీ ఇచ్చినట్టుగానే వచ్చే డిసెంబర్ 26న కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరగాలి అని క్యాబినేట్ సమావేశంలో తీర్మానం చేశారు.

ఏళ్ళుగా రాజకీయాలకు బలైపోతూ వస్తున్న ఉక్కు పరిశ్రమ ఎట్టకేలకు పట్టాలెక్కబోవటంతో రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో తమ చిరకాల కల అయిన ఉక్కు పరిశ్రమ పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం అంటూనే రాజకీయాలు చేస్తూ వచ్చాయి కానీ పరిశ్రమ ఏర్పటు చేయాలి అనే తపన, చిత్తశుద్ది, సంకల్పం మాత్రం ఒక్క జగన్ లో మాత్రమే ఉన్నాయి అనే నమ్మకంతో మా ఓట్లు జగన్ కి వేసి మద్దతు తెలిపాము అని, ఆ నమ్మకంని జగన్ నిలబెట్టుకుంట్టున్నారు అని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News