కడప మాజీ ఎమ్మెల్యేను బలితీసుకున్న కరోనా

By Kiran.G Aug. 11, 2020, 09:18 pm IST
కడప మాజీ ఎమ్మెల్యేను బలితీసుకున్న కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో మరో మాజీ ప్రజాప్రతినిధి కరోనాకు బలయ్యారు. ఇటీవల మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. తాజాగా కడప మాజీ ఎమ్మెల్యే వైరస్‌ వల్ల మరణించారు. కరోనాకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ డాక్టర్‌ ఎమ్మెల్యే ఖలీల్‌ బాష.. ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు మృతి చెందారు. ఖలీల్‌ బాష 1994, 1999 ఎన్నికల్లో కడప నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేశారు.

2004 ఎన్నికల్లో చంద్రబాబు.. కందుల శివానందరెడ్డికి కడప టిక్కెట్‌ ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో ఖలీల్‌ భాష పోటీకి దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆయన తన అనుచరులతో కలసి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp