మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసు ప్రవర్తన

By Krishna Babu Aug. 07, 2020, 08:20 am IST
మరోసారి  జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసు ప్రవర్తన

దివాకర్ ట్రావెల్స్ పేరిట 154 లారీలను అక్రమంగా రిజిస్టర్ చేశారని, బీఎస్-3 వాహనాలని బీఎస్-4గా రిజిస్టేషన్ చేయించడంతో పాటు, నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల తయారీచేసి అక్రమాలకు పాలపడ్డారనే ఆరోపణాలు ఎదుర్కుని 54 రోజుల పాటు కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి ఇద్దరికీ ఎట్టకేలకు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ వ‌చ్చింది.

అయితే బెయిల్ పై విడుదులైన జేసీ ప్రభాకర్ రెడ్డి కడప నుండి పెద్ద ఎత్తున అనుచరులతో ర్యాలీగా తాడిపత్రి బయలుదేరారు. ఈ క్రమంలో వారి అనుచరులు దారిపడువునా పెద్ద ఎత్తున ఈలలు, కేకలతో హంగామ సృష్టించారు, సజ్జల దిన్నే వద్ద ట్రాఫిక్ నియంత్రిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవేంద్రపై తన వాహనాలనే ఆపుతారా అంటు నానా దుర్భాషలాడుతు నీ అంతు చూస్తానంటు బెదిరింపులకి దిగారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp