రాజకీయ సంకటంలో జేసీ సోదరులు!

By Mavuri S Jan. 21, 2021, 09:28 pm IST
రాజకీయ సంకటంలో జేసీ సోదరులు!

ఓ జగన్.... నిన్ను అది చేసేస్తా... ఇది చేసేస్తా అంటూ నడి రోడ్డు మీద టెంట్ వేసిన ఏదేదో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డీ పరిస్థితి ఇప్పుడు గాలిలో చూసుకుని ఏదేదో మాట్లాడుతూ కనిపించే ఎర్రగడ్డ రోగిలా తయారు అయ్యింది.. గొంతులో భయం.. మాటల్లో నిస్సహాయత.. నడకలో ఆఛేతనం కనిపిస్తున్నాయి. నానాటికి దారులన్నీ మూసుకుపోయి అత్యంత దుర్భారమైన పరిస్థితి లోకి వెళ్తున్న జేసీ కుటుంబంలో కొత్త తరం నాయకులు సైతం పాపం ఏం మాట్లాడుతున్నారో..? ఎందుకు మాట్లాడుతున్నారో తెలియని దీనమైన పరిస్థితిలో జేసీ కుటుంబం లో కనిపిస్తోంది. గురువారం అనంతపురం జిల్లా టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జెసి పవన్ రెడ్డి ఏదో ఎక్కడెక్కడో విషయాలు మాట్లాడడం.. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడడం వారి మానసిక పరిస్థితిని తెలియజేస్తోంది. కొద్దిసేపు బీసీలను జగన్ అరెస్టులు చేయిస్తున్నారని... కొద్దిసేపు తనను వేధిస్తున్నారంటూ రకరకాలుగా ఆయన మాట్లాడటం చూస్తుంటే జెసి కుటుంబానికి అనంతపురంలో ఇక కాలం చెల్లిన రోజులు దగ్గర పడ్డాయి కనిపిస్తున్నాయి.

చేసుకున్నదే కదా!

అనంతపురం జిల్లాలో మూడు దశాబ్దాలపాటు చక్రం తిప్పిన కుటుంబంలో భయం వెంటాడుతోంది. ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా ముందుకు వెళ్లాలో? తెలియని అయోమయ పరిస్థితి. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ కనీసం సాయపడదు. చంద్రబాబు తన వరకు వస్తే తప్ప మాట్లాడాడు. పోనీ పార్టీ మారదంటే ఏ పార్టీ అంత అనుకూలంగా లేదు. అధికార పార్టీ తోనే లాలూచీ పడడం అంటే కనీసం అటువైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. దీంతో కుటుంబం మొత్తం అందరిలోనూ అసహనం మాటల్లో కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడటం వారి అనుచరులనే అయోమయంలో పడేస్తుంది. జేసీ కుటుంబాన్ని ప్రస్తుతం చూస్తుంటే అనంతపురంలో వీరేనా హవా వెలగబెట్టింది అన్న అనుమానం కలుగుతుంది. అధికారం నెత్తికెక్కితే వచ్చే మాటల వల్ల తర్వాత ఎంతటి దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కోవచ్చు అన్నది జేసీ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది.

పాపాల చిట్టా పేలి!!

జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జెసి కుటుంబసభ్యులు ఎప్పటినుంచో చేస్తున్న అనధికారిక, అక్రమ వ్యాపారాలు మీద దృష్టి పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా జేసీ సోదరులు చేస్తున్న వ్యాపారాన్ని అక్రమ అని తెలిసినా సరే వారికి రెడ్ కార్పేట్ పరిచేవి. అనంతపురం జిల్లాలో జెసి సోదరులు ఎదిరించి రాజకీయాలు చేయడం అసాధ్యం అనే కోణంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు వారు కళ్లెదుటే చేస్తున్న అక్రమ వ్యవహారాలన్నీ తెలిసినా తెలియనట్లు నటించారు. జగన్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. కచ్చితంగా నిబంధనలు పాటించే తీరాల్సిందేనని ఎలాంటి అక్రమం వ్యవహారాలు వ్యాపారాలు ఉపేక్షించేది లేదని జేసీ సోదరులు కనుసన్నల్లో జరిగే మైనింగ్, రవాణా బస్సులు వంటి పలు విషయాలను తనిఖీలు చేయగా విస్తుపోయే అక్రమాలు బయట పడ్డాయి. దీంతో వాటికి చట్ట పరిధిలో తాళం వేయించారు. జెసి సోదరులు చేస్తున్న ప్రతి వ్యాపారం లోనూ నిబంధనలు పాటించకుండా సాగించిన అక్రమాలకు చెక్ చెప్పడంతో వారి ఆర్ధిక దారులు మూసుకున్నాయి. ఘనంగా రాజకీయాల్లోకి వచ్చిన జెసి ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డీ సైతం దీనమైన పరిస్థితి ఎదురుకుంటున్నారు. ఒకప్పుడు ఎంతో హుందాగా లగ్జరీగా బతికిన వీరు ఇప్పుడు ఆర్థిక దారులన్నీ మూసుకు పోవడంతో ఏం చేయాలో తెలీక రాజకీయంలో ఇమడలేక విలేకరుల సమావేశాల్లో మీడియా ముందు తమ అసహనాన్ని అచేతనాన్ని వెళ్ళగక్కుతూ మాట్లాడటం కనిపిస్తుంది. గురువారం సైతం అనంతపురం టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జేసీ పవన్ రెడ్డి కావాలంటే రాజకీయాలు వదిలేస్తానని అరెస్ట్ లు చేయవద్దంటూ దీనంగా వేడుకోవడం విశేషం.

టీడీపీ నేత రాడు!

జేసీ కుటుంబానికి అండగా ఉండేందూకు చంద్రబాబుకు రారు. అటు టిడిపి నేతలది అదే పరిస్థితి. జేసీ కోసం వెళితే తమకు ఎందుకు వచ్చింది అన్న భావన వారిది. చాలా మంది టిడిపి నేతలు చంద్రబాబు హయాంలో సాగించిన అక్రమ వ్యాపారాన్ని బయటకు వచ్చే అవకాశం ఉండటంతో వారు కనీసం జేసీ సోదరులు పరామర్శించడానికి సైతం వెనుకాడుతున్నారు. దీన్ని గుర్తించుకునే టిడిపి నేతలు జెసి సోదరుల బాధను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

గేట్లు మూసిన బీజేపీ!

ఇక టిడిపిని వీడి బీజేపీని చేరడం జెసి సోదరుల ముందున్న మార్గం. అయితే దీనికి బీజేపీ అధినాయకత్వం నుంచి కొన్ని అడ్డంకులు ఉన్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల అయిపోయిన తర్వాత జెసి సోదరులు బిజెపిలోకి వస్తారని అంతా అనుకున్నారు. కొన్ని రాయబారాలు నడిచాయి. అయితే బీజేపీలోకి వెళ్తే కనీసం తమను ఒక సిద్ధాంతల బరిలోనే ఉంచాతారని భావించిన జేసీ సోదరులు కావాలని వెనకడుగు వేశారు. ఆ సమయంలో బిజెపి అధినాయకత్వం జెసి సోదరులు పార్టీలోకి తీసుకోవాలని భావించింది. అయితే ఇప్పుడు జెసి సోదరులు వైపు నుంచి బీజేపీ లోకి వెళ్లాలని ప్రతిపాదనలు వస్తున్నాయి బిజెపి నేతలు మాత్రం దానికి పచ్చజెండా ఊపడం లేదు. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంలో జెసి సోదరులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp