జమ్ముకశ్మిర్ లద్దాఖ్‌లకు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లు
జమ్మూకశ్మీరు, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లు నియమితులయ్యారు. జమ్మూకశ్మీరు యూటీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర వ్యయవిభాగ కార్యదర్శి గిరీశ్ చంద్ర ముర్ము, లద్దాఖ్‌కు రక్షణ శాఖ మాజీ కార్యదర్శి రాధాకృష్ణ మాధుర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ప్రకటన చేసింది. జమ్మూకశ్మీరు ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను గోవాకు బదిలీ చేశారు. గిరీశ్ చంద్ర గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆర్థిక శాఖలో వ్యయ విభాగ కార్యదర్శిగా ఉ న్న ఆయన వచ్చే నెలలో రిటైర్ కానున్నారు. మాధుర్ త్రిపుర కేడర్ ఐఏఎస్. ఆయన గతంలో రక్షణ శాఖ కార్యదర్శిగా, ముఖ్య సమాచార కమిషనర్‌గా పనిచేశారు. జమ్మూకశ్మీరులో పార్టీలు, సంస్థలతో చర్చలు జరిపే ఇంటర్లొక్యూటర్గా ఉన్న దినేశ్వర్ శర్మను లక్షదీవులకు అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. మిజోరం గవర్నర్‌గా బీజేపీ కేరళ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై నియమితులయ్యారు.


Click Here and join us on WhatsApp to get latest updates.