జ‌గ‌న్ విధానాలు అన్ని రాష్ట్రాలకూ ఆద‌ర్శం : మోదీ

By Kalyan.S Sep. 24, 2020, 07:00 am IST
జ‌గ‌న్ విధానాలు అన్ని రాష్ట్రాలకూ ఆద‌ర్శం : మోదీ

జ‌గ‌న్ విధానాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేసే తెలుగుదేశం పెద్ద‌ల్లారా.. బీజేపీ ప్ర‌ముఖుల్లారా.. ఏడ‌వ‌కండి.. ఏడ‌వ‌కండి..! దేశ వ్యాప్తంగా పెరుగుతున్న జ‌గ‌న్ ఖ్యాతిని చూసి ఏడ‌వ‌కండి. అవును.. ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెడుతున్న సంస్క‌ర‌ణ‌లు.. అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉన్నార‌ని దేశ‌మంతా గుర్తిస్తోంది. ప్ర‌ముఖులెంద‌రో ఏపీని స్తుతిస్తున్నారు. తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి జ‌గ‌న్ చేస్తున్న కృషిని కొనియాడ‌డం దేశ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అన్ని రాష్ట్రాలూ ఏపీని ఆద‌ర్శంగా తీసుకుంటాయ‌ని ఆశిస్తున్నానంటూ సాక్షాత్తూ ప్ర‌ధాని అన‌డం మామూలు విష‌యం కాదు.

అస‌లు విష‌యం ఏంటంటే...

తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం జ‌గ‌న్ అక్క‌డి నుంచే ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కొవిడ్‌ నియంత్రణ చర్యలకు సంబంధించి 7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ఈ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో మీరు అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రజలకు త్వరితగతిన సేవలన్నీ అందుతున్నాయి. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయని భావిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.

మీ వ‌ల్ల స్వామి ద‌ర్శ‌నం అయింది...

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ నియంత్రణ చర్యలకు సంబంధించి సీఎం జగన్‌ వివరిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మీతో ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందన్న సంతోషం కలుగుతోంది’ అన్నారు. సీఎం జగన్‌ వెనుక శ్రీవారి పెద్ద చిత్రపటం చిత్రపటం ఉండడంతో ప్రధాని ఈ విధంగా స్పందించారు. ‘తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి కూడా, మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయమ‌ని జ‌గ‌న్ ను మోదీ అభినందించారు. మోదీ గ‌తంలోనూ ఈ త‌ర‌హా ప్ర‌శంస‌లతో జ‌గ‌న్ ను అభినందించారు. మోదీ యే కాదు.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులెంద‌రో ప‌లు సంద‌ర్భాల్లో జ‌గ‌న్ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌శంస‌లు అందించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp