జ‌గ‌న్ స్ట్రాట‌జీకి చుక్కలు కనిపిస్తున్నాయా..!

By Kalyan.S Jul. 22, 2021, 09:46 am IST
జ‌గ‌న్ స్ట్రాట‌జీకి చుక్కలు కనిపిస్తున్నాయా..!

నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ .. వైసీపీ నాయ‌కులకు బూస్ట్ గా ప‌ని చేస్తోంద‌ని చెప్పొచ్చు. పోస్టుల కేటాయింపులో ఎన్న‌డూ లేని విధంగా సామాజిక న్యాయం పాటించ‌డం, క‌ష్ట‌ప‌డే వారికి గుర్తింపు ద‌క్క‌డం, న‌మ్మ‌కంగా వేచి చూసిన వారిని గుర్తు పెట్టుకుని మ‌రీ ప‌ద‌వి కేటాయించ‌డం.. పార్టీ నేత‌లపై జ‌గ‌న్ సునిశిత దృష్టికి నిద‌ర్శ‌నం. ఈ విష‌యం వైసీపీ శ్రేణుల‌కు బాగానే అర్థ‌మైన‌ట్లుంది. మ‌రోసారి త‌మ‌కూ అవ‌కాశం వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతో చాలా మంది మ‌రింత‌ ఉత్సాహంగా పార్టీ అభివృద్ధికి కృషి చేసేందుకు ముందుకు క‌దులుతున్నారు. పోస్టుల భ‌ర్తీపై వైసీపీలో ఒక్క‌రు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేయ‌లేదు. ఎవ‌రూ క‌నీసం అలిగింది కూడా లేదు. కానీ టీడీపీ నాయ‌కులు మాత్రం తెగ‌ ఫీలైపోతున్నారు. ప్ర‌భుత్వం నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీ చేస్తే.. వారికి వ‌చ్చిన న‌ష్టం ఏంటో తెలియ‌ట్లేదు. ఎవ‌రెవ‌రికి ఎన్ని పోస్టులు కేటాయించారు, ఏ పోస్టులు కేటాయించారో క‌నీసం ప‌రిశీలించ‌కుండానే విమ‌ర్శ‌లు చేసి అభాసుపాల‌వుతున్నారు.

మొత్తం 135 కార్పొరేష‌న్లు, వివిధ సంస్థ‌ల్లో చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం నియ‌మించింది. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు 76 ప‌ద‌వులు కేటాయించింది. వెనుక‌బ‌డిన త‌ర‌గతుల‌కు 56 శాతం ప‌ద‌వులు కేటాయించిన‌ట్టు ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు. ఆ లిస్టును ప‌రిశీలిస్తే అది ఎవ‌రికైనా అర్థం అవుతుంది కూడా. ఇక్క‌డ కూడా మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేశారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ప‌ద‌వులిచ్చి అధికారంలో భాగ‌స్వామ్యం చేసినందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక న్యాయం పాటించేందుకు తీవ్ర‌మైన క‌స‌ర‌త్తే చేసిన‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. అందుకే వైసీపీకి చెందిన ఏ ఒక్క‌రూ అసంతృప్తి కానీ, ఆందోళ‌న కానీ వెలిబుచ్చ‌లేదు. కానీ, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మాత్రం.. డబ్బున్న కుర్చీలు అన్నీ అగ్ర కులాలకు, ఏమీ లేని పదవులు బలహీనులకా అంటూ విమర్శిస్తున్నారు.

విమ‌ర్శ‌లు స‌రే కానీ.. ప‌క్క‌నే ఉన్న విశాఖ జిల్లా నేత‌ల‌కు వ‌చ్చిన ప‌ద‌వుల‌ను కూడా క‌నీసం ప‌రిశీలిచ‌కుండా అచ్చెన్న ఇలా మాట్లాడ‌డం హ్యాస్యాస్ప‌దంగా మారింది. ఈ నామినేటెడ్ జాతరలో పెద్ద ఎత్తున బీసీలకు, ఇతర బడుగు బలహీన వర్గాలకు పదవులు దక్కాయి. మహిళలకు కూడా కీలకమైన బాధ్యతలు అప్పగించారు. మరి వీటినేమీ గ‌మ‌నించ‌కుండానే టీడీపీ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. విశాఖలోని ప్రతిష్టాత్మకమైన వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ పదవిని బీసీ మహిళ‌కు కేటాయించారు జ‌గ‌న్. మ‌రి ఆ విష‌యం అచ్చెన్నాయుడుకు తెలియ‌దా? అంతేకాదు, విశాఖ మేయర్ పీఠంలో కూర్చున్న‌ది కూడా బీసీ మహిళే. మ‌రి అది అచ్చెన్న దృష్టిలో ఎందుకూ ప‌నికి రాని ప‌ద‌వా? అదంతా అటుంచితే, 56 బీసీ కులాలకు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఘ‌న‌త‌.. రాజ‌కీయాల్లో ఘ‌న‌త వ‌హించిన‌ స‌ద‌రు అచ్చెన్నాయుడుకు తెలియాదా? అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.. అచ్చెన్న మాట‌ల‌కు అలాంటి ప్ర‌శ్న‌లు త‌లెత్త‌డం స‌హ‌జ‌మేన‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp