లా నేస్తం నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్

By Krishna Babu Jul. 09, 2020, 02:26 pm IST
లా నేస్తం నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్

ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు మరో పథకాన్ని జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.  ప్రాక్టీస్‌ పీరియడ్‌లో ఉండే జూనియర్‌ న్యాయవాదులకు ఈ పథకం కింద ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తు మూడేళ్ల పాటు వారికి తోడుగా ఉండేందుకు జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గత ఏడాది డిసెంబర్‌ 3న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్‌ లా నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు.

అయితే తాజాగా జగన్ ప్రభుత్వం వైఎస్సార్‌ లా నేస్తం పథకం చెల్లింపులకు కింద మార్చి నుంచి జూన్‌ వరకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు  5,832 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.  మార్చ్ నెలకు సంబంధించి 99.10 లక్షలు, ఏప్రిల్ నెలకు సంభదించి 97.90 లక్షలు, మే నేలకు సంభందిచి 97.30 లక్షలు, జూన్ నెలకు సంబంధించి 96.40 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే కరోనా కారణంగా న్యాయస్థానాల్లో కార్యకలాపాలు సక్రమంగా జరగకపోవడం వలన న్యాయవాదులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను విడుదల చేసి అడ్వకేట్ జనరల్ శ్రీరాంకు జీవో కాపీని అందజేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp