జ‌గ‌న్ బాట‌లో ప‌లువురు ముఖ్య‌మంత్రులు..!

By Raju VS Dec. 02, 2019, 07:32 am IST
జ‌గ‌న్ బాట‌లో ప‌లువురు ముఖ్య‌మంత్రులు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఆరు నెల‌ల్లోనే అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తామ‌ని ప్ర‌క‌టించిన వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారు తీరు దానికి అనుగుణంగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న సాహ‌సోపేత నిర్ణ‌యాల‌ను తాము కూడా అమ‌లు చేస్తామ‌ని చెబుతున్నాయి. చివ‌ర‌కు విప‌క్ష నేత చంద్ర‌బాబు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌రైన నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ముఖ్యంగా ఉద్యోగ నియామ‌కాల విష‌యంలో స్థానికుల రిజ‌ర్వేష‌న్ల అంశం దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది. తొలుత దానివ‌ల్ల ప‌రిశ్ర‌మాధిప‌తులు వెన‌క్కిపోతార‌ని విప‌క్షం అనుమానం వ్య‌క్తం చేసింది. నిపుణులు అందుబాటులో లేక‌పోతే ఏం చేయాల‌నే సందేహం వెలిబుచ్చారు. దానికి అనుగుణంగానే స్థానిక యువ‌త‌కు నైపుణ్యం పెంచేందుకు త‌గ్గ‌ట్టుగా ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ ప్ర‌త్యేక ప్రణాళిక రూపొందిస్తుంద‌ని, ఆయా ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన నిపుణుల‌ను అందించే బాధ్య‌త ప్ర‌భుత్వానిద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఆ దిశ‌లోనే అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Also Reda : జగన్మోహన్ రెడ్డి-ఆరు నెలల పాలన

జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో స్థానికంగా ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయ‌నే ఆశాభావం యువ‌తలో ఏర్ప‌డింది. కొత్త‌గా ఏర్పాటు చేసే ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటుగా ఇప్ప‌టికే ఉన్న ప‌రిశ్ర‌మ‌ల్లో కూడా మూడేళ్ల‌లో స్థానికుల‌కు 70 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు అడుగులు ప‌డుతున్నాయి. ఇది ఇత‌ర రాష్ట్రాల‌ను కూడా ఆక‌ట్టుకుంటోంది. అన్ని చోట్లా ఉపాధి అవ‌కాశాలు కుదించ‌బ‌డుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం రూపొందించిన చ‌ట్టం ఆద‌ర్శ‌నీయంగా మారింది. దాంతో త‌మ రాష్ట్రాల్లో కూడా స్థానికుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే ప్ర‌య‌త్నాల‌కు ఆయా ప్ర‌భుత్వాలు పూనుకుంటున్నాయి. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాలు దానికి సై అన్నాయి. క‌ర్ణాట‌క‌లో బీజేపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండ‌గా రెండు ప్ర‌ధాన జాతీయ పార్టీలు కూడా జ‌గ‌న్ పాల‌సీని అమ‌లుచేసేందుకు సంసిద్ధులు కావ‌డం విశేషం.

Also Read : అదే చంద్ర‌బాబు పాల‌న‌లో అయితే ఈరోజుకిదే హైలెట్..!

తాజాగా మ‌హారాష్ట్ర‌లో కొలువుదీరిన శివ‌సేన సార‌ధ్యంలోని సంకీర్ణ కూట‌మి కూడా త‌మ రాష్ట్రంలో స్థానికుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే చ‌ట్టానికి సిద్ధం అంటూ ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లో చ‌ట్టం రూపొందిస్తామ‌ని ఉద్ద‌వ్ ఠాక్రే అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. ఏపీ ప్ర‌భుత్వం రూపొందించిన చ‌ట్టాన్ని ప‌రిశీలించి, అదే బాట‌లో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ట్టాన్ని రూపొందిస్తుంద‌ని ఆ ప్ర‌భుత్వ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. అదే స‌మ‌యంలో ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌న్నింటినీ త‌ప్పుబ‌డుతున్న చంద్ర‌బాబు కూడా ఈ చ‌ట్టంపై మాత్రం భిన్నంగా స్పందించాల్సి వ‌చ్చింది. దేశ‌మంతా ప్ర‌శంస‌లు అందుకుంటున్న చ‌ట్టాన్ని విప‌క్ష నేత కూడా స‌మ‌ర్థించాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌లో కూడా చంద్ర‌బాబు ఈ చ‌ట్టాన్ని ప్ర‌స్తావించి, ఉపాధి విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు స‌రైన దారిలో సాగుతుంద‌నట్టుగా రీతిలో వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వ‌డ‌మే చందంగా ఏపీలో ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ద్వారా ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా ఆద‌ర్శంగా నిలిచిన జ‌గ‌న్ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశం కావ‌డం విశేష‌మే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp