విద్యాకానుక వారోత్సవాలకు జగన్ సర్కార్ శ్రీకారం.

By Krishna Babu Nov. 21, 2020, 08:15 pm IST
విద్యాకానుక వారోత్సవాలకు జగన్ సర్కార్ శ్రీకారం.

పాఠశాలల్లో నాడు నేడు, అమ్మఒడి, జగనన్న గోరు ముద్ద, కంటి వెలుగు లాంటి విప్లవాత్మకమైన పధకాలను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్.. జగన్ అన్న విద్యాకానుక పేరున విద్యార్ధినీ విద్యారులకు కిట్లను కూడా పంపిణీ చేసిన విషయం తేలిసందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాల్లలో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్ధినీ విద్యార్ధులకు 650 కోట్ల రూపాయల ఖర్చుతో అక్టోబర్ 8న స్టూడెంట్ కిట్లను పంపిణీ చేసింది జగన్ సర్కార్. దేశంలో మరే రాష్ట్రంలోని ప్రభుత్వాలు చేయని విధంగా స్కూల్ విద్యార్ధులకు మూడు జతల యూనిఫాం, స్కూల్ బ్యాగ్,టెక్స్ట్ బుక్స్ , నోట్ బుక్స్ , వర్క్ బుక్స్, బెల్ట్, సాక్స్, షూస్ లాంటి వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే అనడంలో సందేహంలేదు.

ఇక తాజాగా జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాకానుక ఫలాలు పాఠశాలల విద్యార్థులందరికీ అంది పథకం లక్ష్యాలు పూర్తిగా నెరవేర్చేందుకు విద్యాశాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు జగనన్న విద్యాకానుక ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం స్కూల్ పిల్లలకు పంపిణీ చేసిన కిట్లలో ఇచ్చిన వస్తువుల నాణ్యతను, పంపిణీ విధానాన్ని వారోత్సవాల సందర్భంగా పరిశీలించి వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచే నాటికే పథకాన్ని మరింత మెరుగైన ప్రణాళికతో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం ప్రకటించిన వారోత్సవాల షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు జగనన్న విద్యాకానుక పధకం గురించి సమగ్రమైన అవగాహన కల్పించడం. ప్రతి విద్యార్థికి స్టూడెంట్‌ కిట్‌ చేరిందో లేదో పరిశీలించడం. బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ తనిఖీ చేపట్టడం, విద్యార్థులు యూనిఫాం కుట్టించుకున్నారో లేదో పరిశీలించి , కుట్టు కూలి ఖర్చులు తల్లుల ఖాతాలకు జమచేస్తున్న విషయాన్ని వారికి తెలపడం. ఇచ్చిన యూనిఫాం కుట్టించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం. విద్యార్థులు బూట్ల కొలతల్లో ఇబ్బందులుంటే సరిదిద్దడం. పంపిణీ చేసిన పుస్తకాలను ఉపయోగించుకోవడంపై అవగాహన కల్పించడం , పాఠశాల బ్యాగు బరువు తగ్గించే విధానం గురించి అవగాహన కల్పించడం. ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా పాఠశాల విధ్యార్ధులపై ఇంత శ్రద్ద చూపుతున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమే అని ఇది విద్యా వ్యవస్థలో ఒక నూతన అద్యాయంగా చూడొచ్చని ప్రలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp