టీవీ9లో ఏం జరుగుతోంది..మరో కీలక మార్పు ఖాయమేనా?

By Siva Racharla Sep. 24, 2020, 06:00 pm IST
టీవీ9లో ఏం జరుగుతోంది..మరో కీలక మార్పు ఖాయమేనా?

టీవీ9 అంటే రవి ప్రకాష్‌..రవి ప్రకాష్ అంటే టీవీ9 అనుకునే వారు ఒకనాడు. కానీ ఆ మాటకి కాలం చెల్లి ఏడాది దాటింది. అంతా మరచిపోయారు. రవి ప్రకాష్‌ కూడా తెరమరుగయ్యారు. టీవీ9 తన చేతుల్లో ఉండగా చెలరేగిపోయిన ఆయన ప్రస్తుతం పూర్తిగా కనుమరుగయ్యారు. ఏదో ప్రయత్నాలు చేస్తున్నా ఫలించకపోవడంతో ఆయన శిబిరంలో కూడా సందేహాలు చుట్టుముడుతున్నాయి. కానీ పట్టువదలని విక్రమార్కుడు లాంటి రవి ప్రకాష్‌ ఏదొకటి చేస్తారనే గట్టి ధీమా అనుచరుల్లో కనిపిస్తోంది.

రవి ప్రకాష్ ఎపిసోడ్ తర్వాత తాజాగా మరో కీలక పరిణామం ఖాయమనే అభిప్రాయం బలపడుతోంది. ఇప్పటికే దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. ఒకనాటి రవి ప్రకాష్ అనుంగు శిష్యుడు రజనీకాంత్ కూడా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారనే కథనాలు వస్తున్నాయి. మరో వైపు యాజమాన్యమే రజనీకాంత్ ను రాజీనామా చేయమని అడిగారన్న ప్రచారం కూడా ఉంది. రజనీకాంత్ కానీ, టీవీ9 యాజమాన్యం కానీ అధికారికంగా వాటిని ధృవీకరించలేదు. పైగా టీవీ9 అధికారిక వెబ్ సైట్ లో కూడా రజనీకాంత్ ని మేనేజింగ్ ఎడిటర్ గానే పేర్కొన్నారు.

Also Read:వెంకట కృష్ణ చివరకు ఆ గూటికే చేరారు.

వాస్తవానికి రవి ప్రకాష్‌ అండతోనే రజనీకాంత్ ఎదిగిన విషయం అందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత యాజమాన్యం మార్పిడి సమయంలో ఇరువురి మధ్య విబేధాలు వచ్చినట్టు ప్రచారం సాగింది. చివరకు రవిప్రకాష్‌ మీద ఈడీ కేసు నమోదు చేసిన తరుణంలో సదరు వ్యవహారానికి సంబంధించి రజనీకాంత్ పాత్ర మీద కూడా పలు రకాల ప్రచారాలున్నాయి. చివరకు ప్రస్తుతం ఆ కేసు ముందుకు వెళ్లకపోవడానికి కూడా తెరవెనుక కారణాలు తోడ్పడినట్టు ప్రచారం జరిగింది. ఏమయినా ప్రస్తుతం రజనీకాంత్ కూడా టీవీ9 వీడతారనే ప్రచారానికి గల కారణాలు మాత్రం ఆసక్తిగా ఉన్నాయి.

ఇప్పటికే టీవీ9లో రవి ప్రకాష్ అనుచరులైన సీనియర్లను పలువురుని సాగనంపారు .గొట్టిపాటి సింగారావు సీఓఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలక మార్పులు చేస్తున్నారు. ఆ క్రమంలోనే రజనీకాంత్ వ్యవహారశైలికి సంబంధించి కూడా చర్చ సాగింది. టీవీ చర్చలలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇలాంటి సమయంలో ఆయన్ని సాగనంపే యత్నం చేస్తుండడం వెనుక కారణాలు ఆసక్తిగా మారుతున్నాయి. ప్రధానంగా జూపల్లి రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి సంయుక్త యాజమాన్యంలో ఉన్న టీవీ9లో మార్పులు చర్చనీయాంశమే.

Also Read:జగన్ బలం, బాబు బలహీనత కూడా అదే

రజనీకాంత్ టీవీ9 నుండి బయటకు వస్తే టీడీపీకి బహిరంగంగా కొమ్ముకాసే ఒక ఛానల్ తలుపులు తెరిసిపెట్టిందని మీడియా వర్గాలలో చర్చ నడుస్తుంది.నిత్యం జగన్ మీద ఎదో ఒక వివాద కథనం ఇచ్చే ఆ ఛానల్లో స్థిరమైన ఎడిటర్ లేడని అందుకే రజినీకాంత్ కు ఆఫర్ ఇచ్చారంటున్నారు.

మరోవైపు రజినీకాంత్ టీవీ9ను వీడితే తెలంగాణాకు చెందిన ఒక ఛానల్లో పనిచేస్తున్న సీనియర జర్నలిస్టును టీవీ9 లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఒక ఛానల్ ఆయన ఆధ్వర్యంలో మొదలయ్యి తరువాత యాజమాన్యం మారింది. ఎలక్ట్రానిక్ మీడియాలో అతనికున్న అనుభవాన్ని వాడుకునే ఉద్దేశ్యంలో టీవీ9 ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read:చంద్రబాబుకి మరో షాక్, అచ్చెన్నకి పోటీగా బీదా రవిచంద్ర 

రజనీకాంత్ కు మరో ఆఫర్ కూడా ఉందని చెప్తున్నారు. ఒక వేళ ఆ ఆఫర్ రజనీకాంత్ తీసుకుంటే "స్టేట్ వాంట్స్ టూ నో" అనే అవకాశం ఉంటుంది. టీవీ9 ప్రస్థానంలో జరుగుతున్న మార్పులు ఎటు దారితీస్తాయో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp