కొడాలి మీదికి వంగవీటి అస్త్రం - బాబు మార్క్ వాడకం

By Balu Chaganti Sep. 23, 2021, 10:00 am IST
కొడాలి మీదికి వంగవీటి అస్త్రం - బాబు మార్క్ వాడకం

ఏపీ రాజకీయాల్లో నిన్న సాయంత్రం నుంచి వంగవీటి రాధా వర్సెస్ కొడాలి నాని అనే అంశం హాట్ టాపిక్ గా మారింది.. నిజానికి వంగవీటి రాధా కృష్ణ అలాగే కొడాలి నాని మంచి స్నేహితులు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు రాజకీయంగా వీరిద్దరి మధ్య ఇప్పుడు రచ్చ మొదలవబోతోంది అనేది నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న ప్రచారం సారాంశం. ఇది ఎక్కువగా టిడిపి అనుకూల మీడియా వర్గాలలో ప్రచారం అయింది.

వంగవీటి రంగా కుమారుడిగా ఆయన వారసుడిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణ ఇప్పటివరకు ఒక్క సారి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వంగవీటి రంగా చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన రాధాకృష్ణ వైఎస్ హయాంలో ఆయన అండతో 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయంగా వేసిన ప్రతి అడుగు తప్పటడుగు అయ్యింది తప్ప ఒక్క ఒక్కసారి కూడా ఆయనకు కలిసి వచ్చిన దాఖలాలు లేవు. 2009 ఎన్నికల సమయంలో రాధాకృష్ణ ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకోవడం ఆ ఎన్నికలలో ఓటమి పాలవడంతో తరువాత సైలెంట్ అయ్యారు.ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున విజయవాడ ఈస్ట్ మరియు వెస్ట్ నుంచి యలమంచలి రవి ,వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవగా కచ్చితంగా గెలుస్తాడనుకున్న రాధ ఓడిపోవటంతోనే అతని రాజకీయ పతనం మొదలయ్యింది.

Also Read : తెలంగాణ‌లో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

2014లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు, ఆ తర్వాత అడిగిన టికెట్ దక్కలేదనే కారణంతో తన తండ్రి రంగా మరణానికి కారణం అని కాపు వర్గం మొత్తం భావిస్తున్న టిడిపి గూటికి చేరడంతో ఆయనకు పెద్ద మైనస్ గా మారింది. నిజానికి టికెట్ల సర్దుబాటు కాని కారణంగా ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఇప్పించడానికి అప్పట్లో మంత్రి కొడాలి నాని చాలా ప్రయత్నాలు చేశారు, జగన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించారు. అయితే ఆయన మాత్రం టిడిపి గూటికి చేరి కనీసం ఒక్క చోట కూడా పోటీ చేసే అవకాశం రాక కేవలం ప్రచారానికే పరిమితం అయ్యారు.

విజయవాడ సెంట్రల్ సీట్ ఇవ్వలేదని కారణంతో అలిగి వైసీపీ నుంచి తప్పుకున్న వంగవీటి రాధా ఇప్పుడు గుడివాడ మీద దృష్టి పెడుతున్నారు అనేది టీడీపీ చేస్తున్న వ్యూహాత్మక ప్రచారమే కావచ్చు అనే వాదన వినిపిస్తోంది. గుడివాడకు సంబంధించిన కాపు సామాజిక వర్గం పెద్దలతో రాధాకృష్ణ వరుస భేటీలు నిర్వహిస్తున్నారని తాను వచ్చే ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేస్తాననే సంకేతాలు ఇస్తున్నారు అని నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది.

అయితే ఇది చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అనే అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, దానికి తోడు వైసీపీ నుంచి ఆయనకు బలమైన అండదండలు ఉన్నాయి. అక్కడ కొడాలి నాని మీద ఎవరిని నిల్చోబెట్టినా గెలిచే అవకాశాలు దాదాపు అసాధ్యమే. అందుకే మొన్నటి ఎన్నికలలో దేవినేని అవినాష్ ను రంగంలోకి దింపి మొట్ట మొదటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యేలా చేశారనే వాదనలు వినిపిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని త్వరగా అర్థం చేసుకున్న దేవినేని అవినాష్ వెంటనే ఫ్యాన్ గూటికి చేరిపోయారు. ఇక గుడివాడలో రావి వెంకటేశ్వరరావు కూడా కొడాలి నానికి దీటైన నాయకుడు కాదు అని భావిస్తున్న చంద్రబాబు వంగవీటి రాధాకృష్ణను వాడుకోవాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు.

Also Read : చివరికి పేదల సహాయనిధిని కూడా నొక్కేశారు....బాబు హయాంలో జరిగిన మరోస్కామ్

ఎందుకంటే రాధా మళ్ళీ వైసీపీకి దగ్గరవుతారు ఏమో అనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయనకు ఒక అసెంబ్లీ స్థానాన్ని ఇప్పుడే తగిలిస్తే ఆయన టీడీపీలో ఉంటారని బాబు యోచనగా చెబుతున్నారు. అలా ఒక స్థానానికి ఫిక్స్ చేసి ఆయనను పార్టీలో ఉంచాలనే ఉద్దేశంతో ఆయన స్నేహితుడు అయిన కొడాలి నాని మీదకే ఇప్పుడు ఉసిగొల్పే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. వంగవీటి రాధాకృష్ణ, కొడాలి నాని, వల్లభనేని వంశీ చాలా దశాబ్దాలుగా మంచి మిత్రులుగా ఉంటూ వస్తున్నారు. రాజకీయాలకు అతీతమైన స్నేహం వారిది. కానీ ఇప్పుడు చంద్రబాబు దెబ్బతో కొడాలి నాని మీద వంగవీటి రాధా కృష్ణ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకరకంగా చంద్రబాబుని కొడాలి నాని టార్గెట్ చేసినంతగా మరెవరూ చేసి ఉండరు, కొడాలి నాని ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటేనే టిడిపి వర్గీయుల్లో అసహనం పెరిగిపోతుంది . గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని కి సరైన కౌంటర్ ఇచ్చే నాయకుడు లేడని భావిస్తున్న చంద్రబాబు వంగవీటి రాధాకృష్ణను స్నేహితుడు మీదకి పంపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోనే ఈ అస్త్రం సిద్ధం చేశారని అంటున్నారు.

వంగవీటి రాధాకృష్ణ టిడిపిలో చేరుతూ తన తండ్రి మరణానికి సంబంధించి చేసిన కామెంట్స్ చేశాడో అప్పుడే ఆయనకు తన వర్గం నుంచి మద్దతు కోల్పోయేలా చేసింది. తన భావించే కృష్ణలంక లాంటి ప్రాంతాల్లో సైతం వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి మునిసిపల్ ఎన్నికల్లో గెలవడం దానికి నిదర్శం. నిజానికి వంగవీటి రంగా మరణానికి కారణం టిడిపి అని ముందు నుంచి కూడా రంగా వర్గీయులు భావిస్తూ ఉంటారు. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న రాధాకి గెలిచే టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలి కానీ ఇలా మళ్ళీ ఓడిపోయే స్థానం ఇవ్వడం ఏంటని టీడీపీలోనే కొందరు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ క్యాలిక్యులేషన్స్ కి తప్ప ఎలాంటి ఎమోషన్స్ కు చోటివ్వని చంద్రబాబు ఆధ్వర్యంలోని టిడిపి గూటికి చేరిన రాధాకృష్ణ ఇప్పుడు తన వర్గం మద్దతు ఏమేరకు కూడగట్టుకుంటారు? ఎలా అక్కడ రాజకీయం చేయబోతున్నారు అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇది వంగవీటి రాధాకృష్ణ రాజకీయ జీవితంలో మరో ఆత్మహత్య అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి కొడాలి నాని వంటి ధీటైన నాయకుడిని ఎదుర్కోవడానికి వంగవీటి రాధాకృష్ణ ఏ మేరకు తెలుగు దేశానికి ఉపయోగపడతాడు అనేది.

Also Read : ఇక జ‌నాల్లోకి జ‌గ‌న్.. ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాల్సిందే..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp