ఐపీఎల్ లో హైదరాబాద్ కు నో ఛాన్స్.. కారణం అదేనా..?

By Guest Writer Mar. 07, 2021, 06:00 pm IST
ఐపీఎల్ లో హైదరాబాద్ కు నో ఛాన్స్.. కారణం అదేనా..?

ఐపీఎల్ 2011 సీజన్ కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంను న బీసీసీఐ ఎంపిక చేయకపోవడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నెలకొన్న విభేదాలే కారణమా? ఇక్కడ ఐపీఎల్ నిర్వహించకపోవడానికి ఆ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ సుముఖంగా లేకపోవడమే కారణమా? కారణాలు ఏదైతేనేమి గాని ఈసారి సగటు హైదరాబాద్ క్రికెట్ అభిమాని నిరాశకు గురయ్యాడు.

కేటీఆర్ చొరవ చూపిన ఫలితం శూన్యం

ఈసారి ఐపిఎల్ నిర్వహణకు హైదరాబాద్ ను వేదికగా చేసుకోవాలని మంత్రి కేటీఆర్ బీసీసీఐని కోరారు. కరోనా కేసులు నమోదవుతున్న మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాదులోనే అతి తక్కువ అ కేసులు నమోదు అవుతున్నాయని ఆయన గతంలోనే తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ బీసిసిఐ హైదరాబాద్లో కాదని చెన్నై కలకత్తా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనుంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు మొత్తం 56 మ్యాచ్లు జరగనున్నాయి. చెన్నై, కలకత్తా, ముంబై, బెంగుళూరు స్టేడియంలో పదేసి చొప్పున మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఢిల్లీ అహ్మదాబాద్ స్టేడియంలో మాత్రం ఎనిమిది మ్యాచ్లు చొప్పున జరగనున్నాయి. ఈసారి జరిగే ఐపీఎల్ లో ఏ జట్టు తమ సొంత మైదానంలో ఆడబోయేది లేదు. మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో కలుపుకొని మొత్తం 12 మ్యాచ్లకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

Also Read: కర్రా రాజారావు రాజకీయాల్లో విజయం చూడని డాక్టర్

హెచ్ సిఎలో విభేదాలే కారణమా?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కొంతకాలంగా పాలక మండలి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. పాలకమండలి కార్యవర్గం ఒకవైపు ఉంటే భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ మాత్రం మరోవైపు ఉన్నారు. అంతేకాకుండా ఈ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ ఇక్కడ అ మ్యాచ్లు నిర్వహించడానికి ఇష్టపడనట్లు తెలుస్తుంది.

అహ్మదాబాదులో ఐపీఎల్ అందుకేనా?

ఐపీఎల్ పోరులో తలబడపోయే జట్లలో అహ్మదాబాద్ జట్టు లేదు. అయినప్పటికీ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంను ఐపీఎల్ నిర్వాహకులు ఎంచుకోవడం గమనార్హం. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ కు హైదరాబాద్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తుంది. అప్పటి నుంచి 2020 వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తూ వస్తుంది. ఉప్పల్ లో జరిగే మ్యాచ్ లు చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. అయినప్పటికీ ఈసారి ఉప్పల్ ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. నరేంద్రమోడీ స్టేడియం ఎంపిక విషయంలో అమిత్ షా కుమారుడు, అహ్మదాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జైషా ప్రమేయం ఉన్నట్లు క్రికెట్ పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రధాని సొంత రాష్ట్రం కూడా కావడం ఈ స్టేడియం ఎంపికకు కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సారి హైదరాబాద్ కు నిరాశే మిగిలిందని చెప్పొచ్చు.

Also Read: బొబ్బిలి కోటలో పాగా వేసేది ఎవరు?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp