కొత్త పాయింట్ : అభివృద్ధి టీఆర్ఎస్ దా? ఈట‌ల రాజేంద‌ర్ దా?

By Kalyan.S Oct. 13, 2021, 08:30 am IST
కొత్త పాయింట్ : అభివృద్ధి టీఆర్ఎస్ దా? ఈట‌ల రాజేంద‌ర్ దా?

హుజూరాబాద్ రాజ‌కీయాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ప్ర‌ధానంగా మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ ఇద్ద‌రూ అభివృద్ధి మంత్రం ప‌టిస్తున్నారు. దీనిపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక్క‌డ అభివృద్ధి చేసింది ఈట‌ల రాజేంద‌రా, టీఆర్ఎస్ పార్టీయా? టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌నిదే ఎమ్మెల్యే ఏమీ చేయ‌లేరు. ఎమ్మెల్యే ప్ర‌తిపాదించ‌న‌దే ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌దు. ఇన్నాళ్లూ హుజూరాబాద్ అభివృద్ధికి కారుకులెవ‌రు అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నగా మారింది.

హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈట‌ల రాజేంద‌ర్ సుదీర్ఘ కాలం పాటు ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించారు. నియోజ‌క‌వ‌ర్గం లో ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. ఫ‌లితంగా అప‌జ‌యం అనేది లేకుండా అప్ర‌తిహ‌తంగా గెలుస్తూనే ఉన్నారు. ప‌లు ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అనూహ్యంగా ప్ర‌భుత్వం మంత్రి ప‌ద‌వి నుంచి ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం, ఆయ‌న రాజీనామా చేసి బీజేపీలో చేర‌డం తెలిసిందే. ఇప్పుడు ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్, ఈట‌ల రాజేంద‌ర్ హోరాహోరీగా పోరాడుతున్నారు. గెలుపుకోసం రెండు పార్టీల అభ్య‌ర్థులూ త‌ల‌ప‌డుతున్నారు. ఒక అంశాన్ని మాత్రం ఇద్ద‌రూ ప్ర‌చారం చేస్తున్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ది కి ప‌ట్టం క‌ట్టండి అని.. అభ్య‌ర్థి గెల్లు ప్ర‌చారం చేస్తుంటే.. తాను చేసిన అభివృద్దిని చూసి ఓట్లు వేయాల‌ని రాజేంద‌ర్ కోరుతున్నారు.

Also Read : ఈటలను గెలిపించేందుకే రేవంత్‌ ‘ప్రమాదకరం’ వ్యాఖ్యలు చేశారా..?

దీంతో పాటు ఇద్ద‌రూ ప్రచారంలో వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధర్మమే గెలుస్తుందని తన ప్రచార సరళిలో పదేపదే చెబుతున్నారు. ఇప్పటికే ఈటల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో కాలు నొప్పితో పాదయాత్రను రద్దు చేసుకొని గ్రామ గ్రామాల్లో గడపగడపకు ఒక్కరే ప్రచారం చేశారు. అన్ని కుల సంఘాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ముందున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం రాష్ట్ర కేంద్ర నాయకులు నియోజకవర్గంలో సభలు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది .

ఈటల రాజేందర్ కమలాపూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలు మంత్రి పదవులను పొందాడు. ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిస్తే తన సొంత చరిష్మా ఉంటుందని భావిస్తున్నారు . 2018 ఎన్నికల్లో ఆనాటి బీజేపీ నుండి ఎమ్మెల్యేగా పోటీచేసిన అభ్యర్థి సుమారు పదహారు వందల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి . ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీ నుండి పోటీ చేయడం వల్ల ఆయన పార్టీ బలంతో కాకుండా సొంత చరిష్మాను నమ్ముకొని ఆయన ప్రచారం చేస్తున్నారు . మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు గెలిపిస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని గెల్లు శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు పూర్తిస్థాయిలో నియోజక వర్గంలో ఉంటూ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా రెండు పార్టీలూ ప్ర‌చారంలో వినూత్నంగా ముందుకు సాగుతున్నాయి.

Also Read : హరీష్‌రావును కూడా టీఆర్‌ఎస్‌ నుంచి పంపేస్తారా..? ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యల్లో నిజమెంత..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp