రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By Kiran.G 22-11-2019 05:51 PM
రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణాలో రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 5100 రూట్ల ప్రైవేటీకరణకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు రిట్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

మోటార్ వెహికిల్ 1988 చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే విశేష అధికారాలున్నాయని హైకోర్టు తెలిపింది. రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనితో రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.

కాగా ప్రశాంత వాతావరణం కల్పిస్తే విధుల్లో చేరుతామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో, సమ్మె కొనసాగింపుగా సేవ్ ఆర్టీసీ పేరిట అన్ని డిపోల దగ్గర ర్యాలీలు నిర్వహిస్తామని తెలంగాణ ఆర్టీసీ జెఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి ప్రకటించారు.దీనిలో ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొనాలని కోరారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News