ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ

By Kiran.G 12-11-2019 05:04 PM
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ

ఆర్టీసీ సమ్మె గురించి హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది . విచారణలో భాగంగా ఆర్టీసీ కార్మికులపై ఎస్మా చట్టం ప్రయోగించాలన్న ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనకు అది తమ పరిధిలో లేని అంశమని స్పష్టం చేసింది.1998 మరియు  2015 లో ఇచ్చిన తీర్పు ఆధారంగా సమ్మె చట్ట విరుద్ధం అని ప్రకటించాలని, ప్రభుత్వ తరపు న్యాయవాది విద్యాసాగర్ కోరగా, 1998 లో ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనిదని తెలిపింది. 

2015 లో  ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడుతూ, 6 నెలల వరకే ఆ తీర్పు పరిమితమని స్పష్టంచేసింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీ వేయాలని ఆదేశమిచ్చింది . సమ్మె విషయంలో  ప్రభుత్వ అభిప్రాయం రేపటిలోగా చెప్పాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వాదనలు విన్న తర్వాత విచారణను బుధవారానికి వాయిదా వేశారు. 

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News